Share News

ఒళ్లు గగుర్పొడిచే స్టంట్.. నిట్టనిలువుగా కొండపైకి డ్రైవింగ్.. డ్రైవర్ ట్యాలెంట్‌కు ఫిదా కావాల్సిందే..

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:57 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని థ్రిల్లింగ్ ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తూ చేసే విన్యాసాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.

ఒళ్లు గగుర్పొడిచే స్టంట్.. నిట్టనిలువుగా కొండపైకి డ్రైవింగ్.. డ్రైవర్ ట్యాలెంట్‌కు ఫిదా కావాల్సిందే..
dangerous hill climb

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని థ్రిల్లింగ్ ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తూ చేసే విన్యాసాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ థ్రిల్లింగ్ స్టంట్‌కు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Heavy driving viral video).


rockcrawldaily అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి నిటారుగా ఉన్న కొండ మీదకు కారు ఎక్కిస్తున్నాడు. చాలా నెమ్మదిగా ఆ ప్రయాణం మొదలైంది. ఆ కారు చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా కొండ ఎక్కేసింది. సాధారణ కారు అలాంటి నిటారుగా ఉన్న కొండను ఎక్కడం అసాధ్యం. కానీ ఈ ఆఫ్-రోడ్ కారు ఎక్కడా జారిపోకుండా కొండ పైకి చేరుకుంది. డ్రైవర్ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది (Car climbs steep hill).


ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Dangerous hill climb). ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. వేలాది మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. గురుత్వాకర్షణ శక్తి సెలవులో ఉందేమోనని ఒకరు కామెంట్ చేశారు. 'ఇది కారు సామర్థ్యం మాత్రమే కాదు.. డ్రైవర్ ప్రతిభ కూడా' అని మరొకరు పేర్కొన్నారు. 'ఇది కేవలం ఉత్కంఠభరితమైనది మాత్రమే కాదు.. సాంకేతికత, నైపుణ్యాల కలయిక' అని ఇంకొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఎముకలు విరగకపోతే నేరం కాదు.. మహిళలకు వ్యతిరేకంగా తాలిబన్ల అమానవీయ చట్టం..


మీ అబ్జర్వేషన్‌కు టెస్ట్.. ఈ కుక్కలకు కావాల్సిన ఎముక ఎక్కడుందో 12 సెకెన్లలో గుర్తించండి..

Updated Date - Feb 19 , 2026 | 03:57 PM