Share News

మద్యం మత్తులో రెచ్చిపోయిన యువతి.. మందు తాగొద్దన్నందుకు పోలీసులపై..

ABN , Publish Date - Apr 08 , 2026 | 10:07 AM

మద్యం మత్తులో ఓ యువతి రెచ్చిపోయింది. పవిత్ర గంగానది ఒడ్డున మందు తాగటమే కాకుండా.. ప్రశ్నించిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. ఈ సంఘటన రిషికేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.

మద్యం మత్తులో రెచ్చిపోయిన యువతి.. మందు తాగొద్దన్నందుకు పోలీసులపై..
Rishikesh viral video

ఇంటర్‌నెట్ డెస్క్: మద్యం మత్తులో ఓ యువతి రెచ్చిపోయింది. పవిత్ర గంగానది ఒడ్డున మందు తాగటమే కాకుండా.. ప్రశ్నించిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. భర్త ముందే పోలీసులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఈ సంఘటన రిషికేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్యానాకు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి రిషికేశ్‌ పర్యటనకు వెళ్లింది. పవిత్ర గంగానది ఒడ్డున మందు తాగసాగింది. ఇది గమనించిన పోలీసులు ఆమె దగ్గరకు వెళ్లారు. మందు తాగకూడదని చెప్పారు.


అయితే, మద్యం మత్తులో ఉన్న ఆమె వారి మాటలు లెక్కచేయలేదు. పైగా పోలీసులతో గొడవకు దిగింది. ‘మీ డబ్బులతో మందు తాగానా?’ అంటూ రెచ్చిపోయింది. పోలీసులు ఎంతో ఒపిగ్గా ఆమెకు నచ్చజెప్పడానికి చూశారు. కానీ, ఆమె మాత్రం ‘మాలాంటి టూరిస్టుల వల్లే స్థానికుల బిజినెస్ నడుస్తోంది. కానీ, అధికారులు మాత్రం టూరిస్ట్‌లను టార్గెట్ చేసి ఇబ్బందిపెడుతున్నారు’ అని అంది. గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. జనం పెద్ద సంఖ్యలో అక్కడ గుమి గూడారు. పరిస్థితి చెయ్యి దాటి పోతుండటంతో మహిళ భర్త రంగంలోకి దిగాడు.


ఆమెకు నచ్చజెప్పి అక్కడినుంచి కారు దగ్గరకు తీసుకుపోయాడు. భుపి పన్వర్ అనే వ్యక్తి ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పవిత్ర స్థలంలో మందు తాగుతావా.. నిన్ను అరెస్ట్ చేయాలి’..‘మందు తాగటమే తప్పు. పోలీసులతో గొడవ పెట్టుకుంటావా?’ అంటూ మండిపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

హైటెన్షన్.. ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద ఆందోళనకు వైసీపీ ప్లాన్.. పోలీసుల భారీ బందోబస్తు

ముగ్గురి ప్రాణాలను బలిగొన్న లారీ

Updated Date - Apr 08 , 2026 | 10:16 AM