దీపావళి కానుకగా ఉద్యోగులకు కార్లు ఇచ్చిన హర్యానా సంస్థ.. కండిషన్ ఏంటంటే..
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:10 PM
హర్యానాకు చెందిన ఓ సంస్థ నలుగురు ఉద్యోగులకు ఖరీదైన కార్లను బహుమతిగా అందించింది. హర్యానాలోని పంచకులాలో ఉన్న ఔషధ తయారీ సంస్థ 'మిట్స్ హెల్త్‌కేర్' దీపావళికి ముందు నలుగురు ఉద్యోగులకు కియా సోనెట్ ఎస్‌యూవీలను అందించింది.
ఇంటర్నెటె డెస్క్: హర్యానాకు చెందిన ఓ సంస్థ నలుగురు ఉద్యోగులకు ఖరీదైన కార్లను బహుమతిగా అందించింది. హర్యానాలోని పంచకులాలో ఉన్న ఔషధ తయారీ సంస్థ 'మిట్స్ హెల్త్‌కేర్' దీపావళికి ముందు నలుగురు ఉద్యోగులకు కియా సోనెట్ ఎస్‌యూవీలను అందించింది. సంస్థ వ్యవస్థాపకుడు, మిట్స్ గ్రూప్ ఛైర్మన్ ఎం.కే. భాటియా స్వయంగా ఈ కార్లను ఉద్యోగులకు అందజేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి (MITS Healthcare car gifts).
ఉద్యోగులకు ఇచ్చిన ఈ బహుమతుల వెనుక చిన్న మెలిక కూడా ఉంది. ఈ కార్లకు సంబంధించిన డౌన్ పేమెంట్లను మాత్రమే సంస్థ భరిస్తుంది. మిగిలిన మొత్తానికి సంబంధించిన ఈఎమ్‌ఐలను ఉద్యోగుల జీతాల నుంచి సర్దుబాటు చేస్తుంది. అందువల్ల ఈ కార్లను పూర్తి ఉచితంగా ఇచ్చిన బహుమతులుగా భావించడానికి కుదరదు. కార్లను అందజేసే కార్యక్రమాన్ని సంస్థ ప్రత్యేకంగా నిర్వహించింది. షోరూమ్‌లో నల్లటి వస్త్రాలతో కప్పి ఉంచిన నాలుగు కార్లను ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఆవిష్కరించారు (Haryana company gifts cars).
ఈ సందర్భంగా డప్పుల మోత, కేక్ కటింగ్‌తో సంబరాలు చేసుకున్నారు (Diwali gifts to employees). సహోద్యోగులు చప్పట్లతో వారిని అభినందించారు. ఉద్యోగుల పనితీరు, సంస్థ పట్ల వారి నిబద్ధత, దీర్ఘకాలిక సేవలను గుర్తించి ఈ బహుమతులు అందించినట్లు భాటియా తెలిపారు. ఈ నలుగురికి మాత్రమే కాకుండా, అర్హులైన ఇతర సిబ్బందికి కూడా అవకాశం కల్పించేలా సంస్థ లక్కీ డ్రా విధానాన్ని ప్రవేశపెట్టింది. సంస్థలో కనీసం 18 నెలలుగా పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
చైనా చొరబాటు అంటూ తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: కిరణ్ రిజిజు
అమెరికా భారీ సైనిక ప్రణాళిక.. భారీ యుద్ధం వచ్చినా 90 రోజులు పనిచేసేలా..