Share News

1500 జాబ్స్‌కు అప్లై చేసినా రిప్లై లేదు.. ఎన్నారై ఆవేదన

ABN , Publish Date - May 30 , 2026 | 10:19 PM

అమెరికాలో దాదాపు 1500 జాబ్స్‌కు దరఖాస్తు చేసుకున్నా స్పందన కరువైందంటూ ఒక ఎన్నారై నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

1500 జాబ్స్‌కు అప్లై చేసినా రిప్లై లేదు.. ఎన్నారై ఆవేదన

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో 1,500 పైచిలుకు జాబ్స్‌కు దరఖాస్తు చేసినా ఒక్క కంపెనీ కూడా స్పందించలేదంటూ ఒక హెచ్-1బీ వీసాదారుడు ప్రముఖ చర్చావేదిక రెడిట్‌లో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పరిస్థితితో మానసిక వేదన అనుభవిస్తున్నానని ఎన్నారై చెప్పారు.

తానేమీ ఫ్రెషర్‌ను కాదని అన్నారు. ఒహాయో రాష్ట్రంలో గత మూడేళ్లుగా డేటా ఇంజనీర్‌గా చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను పనిచేస్తున్న కంపెనీ హెచ్-1బీ వీసా రెన్యూవల్‌కు సిద్ధంగా లేకపోవడంతో మరో జాబ్‌ కోసం వెతకాల్సి వస్తోందని అన్నారు.

Jobs.jpg


‘ఈ రంగంలో నాకు మంచి అనుభవం ఉంది. క్లౌడ్ టెక్నాలజీలు, ఈటీఎల్ వర్క్‌ఫ్లోస్, ప్రొడక్షన్ సిస్టమ్స్ వంటి అంశాలపై పట్టు ఉంది. అమెరికా వ్యాప్తంగా అనేక చోట్ల జాబ్స్‌కు దరఖాస్తు చేసుకున్నా స్పందన లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ ఇలా ఉందా? లేదా నేనున్న ప్రాంతం వల్ల సమస్యా? వీసా స్పాన్సర్‌షిప్ విషయంలో కంపెనీలు సందేహిస్తున్నాయా? లేక మరేదైనా సమస్య ఉందా?.. అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు’ అని పోస్టు పెట్టారు. ఈ విషయంలో ఎవరైనా సలహా చెప్పాలని కోరారు.

ఈ పరిస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ కూడబెట్టుకున్న డబ్బు ఖర్చైపోకముందే ఇండియాకు వెళ్లిపోవాలని పలువురు సూచించారు. ఒక్క కంపెనీ కూడా స్పందించలేదంటే డేటా ఇంజనీరింగ్ నైపుణ్యాలు ప్రస్తుతం ఎవరికీ అవసరం లేదని భావించాలని మరికొందరు అన్నారు. ఇప్పటికే డేటా రంగ నిపుణులు అనేక మంది ఉద్యోగాల్లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

పిల్లిపై ప్రేమతో ఘనంగా పుట్టినరోజు వేడుక.. వీడియో వైరల్

ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ.. నెలకు ఎంత సంపాదిస్తుందంటే..!

Updated Date - May 30 , 2026 | 10:30 PM