Share News

పిల్లిపై ప్రేమతో ఘనంగా పుట్టినరోజు వేడుక.. వీడియో వైరల్

ABN , Publish Date - May 30 , 2026 | 09:29 PM

ఈ రోజుల్లో చాలామంది పెంపుడు జంతువులను కేవలం ఇళ్లల్లో పెంచుకోవడమే కాదు, వాటిని తమ సొంత పిల్లలకంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. తాజాగా ముంబైకి చెందిన ఒక వ్యక్తి తన పెంపుడు పిల్లిపై ఉన్న ప్రేమతో చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది..

పిల్లిపై ప్రేమతో ఘనంగా పుట్టినరోజు వేడుక.. వీడియో వైరల్
Viral Cat Birthday Party

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చాలామంది పెంపుడు జంతువులను కేవలం ఇళ్లల్లో పెంచుకోవడమే కాదు, వాటిని తమ సొంత పిల్లలకంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ముంబైకి చెందిన ఓ యువకుడు తన 'జాభ్యా' (పెంపుడు పిల్లి పేరు) కోసం ఘనంగా జరిపిన పుట్టినరోజు వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వేడుకలో కేక్ కటింగ్, ఒక భారీ పుట్టినరోజు పోస్టర్, లైవ్ మ్యూజిక్, డ్యాన్స్, సామూహిక విందు వంటివి ఉన్నాయి. సాధారణంగా ఇంట్లో జరుపుకొనే బర్త్‌డే వేడుకలకు భిన్నంగా.. భారీ ఖర్చుతో ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు


పెంపుడు జంతువులపై ఇంతటి ప్రేమ చూపించడం అభినందనీయమని కొందరు అంటుంటే.. నేటి కాలంలో మనుషులకు కూడా దక్కని గౌరవం, ఆడంబరం ఒక పిల్లికి దక్కిందంటూ మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘మనుషులకు కూడా ఈ రేంజ్ గౌరవం, అదృష్టం దక్కవు బాబోయ్!’ అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.


ఇవి కూడా చదవండి

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. స్వదేశానికి వెళ్లాల్సిందేననే నిబంధనపై అమెరికా యూటర్న్..

వైభవ్ శరీరమే లక్ష్యంగా బౌలింగ్.. గుజరాత్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..

Updated Date - May 30 , 2026 | 09:46 PM