Share News

పని మనిషిపై దాడి.. వైరల్ వీడియో కారణంగా అరెస్టైన మహిళ..

ABN , Publish Date - Aug 11 , 2026 | 01:44 PM

పని మనిషిపై దాడి చేసిన యజమానిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన హర్యానాలో సోమవారం చోటుచేసుకుంది.

పని మనిషిపై దాడి.. వైరల్ వీడియో కారణంగా అరెస్టైన మహిళ..
Gurugram Woman Assault

ఇంటర్‌నెట్ డెస్క్: పని మనిషిపై దాడి చేసిన యజమానిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన హర్యానాలో సోమవారం చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. రుచిర సచ్‌దేవ్ అనే 52 ఏళ్ల మహిళ గురుగ్రామ్, సెక్టార్ 42లోని ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటోంది. జులై 24వ తేదీన పని విషయంలో రుచిర సచ్‌దేవ్‌కు పని మనిషికి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. ఈ నేపథ్యంలోనే రచిర పని మనిషిపై దాడి చేసింది. పని మనిషి ఫోన్ లాక్కుని ఓ రూములో బంధించింది. దీన్నంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు.


ఆ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియో ఆధారంగా సుశాంత్ లోక్ పోలీస్ స్టేషన్ అధికారులు సుమోటో కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పని విషయంలో ఇద్దరికీ గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. జులై 24వ తేదీ సంఘటన జరగగా.. జులై 27వ తేదీన పని మనిషి పని మానేసిందని వెల్లడించారు. సుశాంత్ లోక్ పోలీసులు సోమవారం రుచిర సచ్‌దేవ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదల అయింది.


ఇవి కూడా చదవండి

వైసీపీ పట్ల భవిష్యత్‌లో జాగ్రతగా ఉండకపోతే.. తీవ్ర ఇబ్బందులు: మంత్రి అచ్చెన్న

ఓటు తొలగించటంపై వ్యంగ్యంగా స్పందించిన ప్రకాశ్ రాజ్

Updated Date - Aug 11 , 2026 | 01:52 PM