కరెన్సీ నోట్లలో మునిగిపోయిన జానపద గాయకుడు.. వీడియో వైరల్..
ABN , Publish Date - May 15 , 2026 | 05:46 PM
గుజరాతీ జానపద గాయకుడికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ జానపద ప్రదర్శన కార్యక్రమంలో సింగర్ పాట పాడుతుండగా చుట్టూ చేరిన అభిమానులు డబ్బులతో ముంచెత్తారు. బస్తాల కొద్దీ నగదు తెచ్చి కళాకారుడిపై పోశారు.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాతీ జానపద గాయకుడికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ జానపద ప్రదర్శన కార్యక్రమంలో సింగర్ పాట పాడుతుండగా చుట్టూ చేరిన అభిమానులు డబ్బులతో ముంచెత్తారు. బస్తాల కొద్దీ నగదు తెచ్చి కళాకారుడిపై పోశారు. ఆ దృశ్యాలను ఓ ప్రేక్షకుడు వీడియో తీయగా.. గాయకుడు దాన్ని తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆయన డబ్బులో కూరుకుపోయిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
జునాగఢ్‌లోని ఖంభాలియాలో గుజరాతీ జానపద ప్రదర్శన అయిన 'దైరో' జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జానపద గాయకుడు గోపాల్ సాధుని గ్రామస్థులు ఆహ్వానించారు. అక్కడికి చేరుకున్న ఆయన హార్మోనియం వాయిస్తూ పాట పాడడం మొదలెట్టారు. గోపాల్ గాత్రానికి పరవశించిపోయిన ప్రేక్షకులు డబ్బులు చల్లడం మొదలెట్టారు. పాట పాటకు బస్తాల కొద్దీ నగదు తెచ్చి ఆయనపై పోశారు. ఆ నగదు కుప్ప ఎంతగా పెరిగిపోయిందంటే ఏకంగా గాయకుడు అందులో కూరుకుపోయాడు. అతని చుట్టూ లక్షల రూపాయల కరెన్సీ నోట్లు పేరుకుపోయాయి.
అతి కష్టం మీద గోపాల్ తలను బయటకు పెడుతూ పాటలు పాడుతూనే ఉన్నాడు. ఎంత నగదు తనపై వేసినా చలించకుండా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 'వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇదేనేమో.. కేవలం కూర్చొని పాటలు పాడుతూ నోట్ల వర్షంలో తడిసిపోతున్నారు' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'ఆ కరెన్సీ నోట్లలో మునిగిపోయి సింగర్ సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోతున్నారు' అని మరొకరు.. 'ఈ డబ్బులో కొంతైనా పేద, నిరుపేదల సంక్షేమానికి కేటాయిస్తారని ఆశిస్తున్నా' అంటూ ఇంకొకరు కామెంట్ పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
రైలు బాత్‌రూమ్‌లో షాకింగ్ సీన్.. వీడియో వైరల్
ప్యాసింజర్‌కు రైల్వే శాఖ ఊహించని సర్‌ప్రైజ్!