గుజరాత్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన కాలనీలు.. వైరల్ వీడియో
ABN , Publish Date - Jul 25 , 2026 | 03:39 PM
గుజరాత్‌లోని వల్సాద్‌లో భారీ వర్షాలకు నివాస సముదాయాలు నీట మునిగాయి. ఓ వ్యక్తి తన ఇంటి బయట వరద నీటిలో నిలబడి ఉన్న వీడియో వైరల్ అయింది. ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఆ వీడియో చూస్తే తెలుస్తోంది..
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని వల్సాద్‌లో భారీ వర్షాలకు నివాస సముదాయాలు నీట మునిగాయి. ఓ వ్యక్తి తన ఇంటి బయట వరద నీటిలో నిలబడి ఉన్న వీడియో వైరల్ అయింది. ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వీధులు, రోడ్లు పూర్తిగా నీట మునిగిపోవడంతో, సదరు యువకుడు తన ఇంటి బయట మెడలోతు వరద నీటిలో నిలబడి పరిస్థితిని వివరించాడు. పార్క్ చేసిన వాహనాలు, ప్రహరీలు, భవనాల పైభాగాలు మాత్రమే బయటకు కనిపిస్తున్న ఈ దృశ్యాలు వరద తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఈ వీడియోలో సదరు వ్యక్తి మునిగిపోయే స్థాయిలో నీరు చేరడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీధులు, ఖాళీ స్థలాల మధ్య తేడా తెలియకుండా అంతా జలమయం కావడంతో అక్కడి నివాసితుల దైనందిన జీవితం పూర్తిగా స్తంభించిపోయింది. పట్టణాల్లో అరకొరగా ఉన్న మురుగునీటి పారుదల వ్యవస్థలు, ఈ తరహా ముంపునకు ప్రధాన కారణమని ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దృశ్యాలు చూసిన పలువురు నెటిజన్లు శివమ్ సింగ్, ఇతర నివాసితులు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని కోరారు. మరోవైపు అధికారులు, రెస్క్యూ టీమ్ ఇప్పటికే పలువురిని సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి..