జీటీఏ-6 కోసం రూ. 5 లక్షలతో ఏర్పాట్లు.. చివరి నిమిషంలో..
ABN , Publish Date - Nov 19 , 2026 | 09:28 PM
జీటీఏ-6 కోసం లక్షలు ఖర్చు పెట్టి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న ఓ గేమర్‌కు చివరి నిమిషంలో ఊహించని షాక్ కొట్టిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: జీటీఏ-6 కోసం లక్షలు ఖర్చు పెట్టి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న ఓ గేమర్‌కు చివరి నిమిషంలో ఊహించని షాక్ కొట్టిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గేమ్ విడుదలకు సరిగ్గా ఒక్క రోజు ముందు తనకు ఎలాంటి అనుభవం ఎదురైందో చెబుతూ అలోక్ ఆనంద్ అనే గేమర్ ఓ వీడియోను నెట్టింట షేర్ చేశారు.
జీటీఏ-6కి కోసం తాను ప్రత్యేకంగా రూ.2.5 లక్షలు పెట్టి హైఎండ్ పీసీని కొనుక్కున్నట్టు అలోక్ ఆనంద్ తెలిపాడు. దానితో పాటు డ్యుయెల్ మానిటర్లు, క్యాప్చర్ కార్డు, వెబ్‌కామ్, మైక్రోఫోన్, ప్లే స్టేషన్-5 వంటివన్నీ కొనుగోలు చేసినట్టు వెల్లడించాడు. వీటన్నిటికీ దాదాపు రూ.5 లక్షలు ఖర్చయ్యిందని తెలిపాడు. ఈ డబ్బు సమకూర్చుకునేందుకు రకరకాల జాబ్స్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలు కూడా పడాల్సి వచ్చిందని తెలిపాడు.
కానీ గేమ్ విడుదలకు సరిగ్గా ఒక్క రోజు ముందు తన పీసీ పాడైపోవడంతో ఊహించని దెబ్బతగిలిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంత కష్టపడ్డాక కూడా ఇలాంటి ఫలితం వచ్చినందుకు నిరాశ పీక్స్‌కు చేరిందని చెప్పాడు. కనీసం కన్నీళ్లు కూడా రానీ ఓ నిర్లిప్తత ఆవరించిందని అన్నాడు.
ఈ పోస్టుకు అతడి ఫాలోవర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఆ యువకుడిని అనేక మంది ఊరడించారు. ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతుంటాయని, పట్టించుకోకుండా ముందుకు వెళితే అనుకున్నది సాధించవచ్చని భరోసా ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టివేత.. రూ.710 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..
నైలాన్ తాడుతో చిన్నారి చేతులు కట్టేసి కొట్టిన టీచర్.. తమిళనాడు స్కూల్లో ఘటన