సెక్యూరిటీ గార్డులపై రెచ్చిపోయిన మహిళ.. మరీ ఇంత దారుణమా..
ABN , Publish Date - Aug 27 , 2026 | 08:02 PM
డెలివరీ బాయ్‌ని ఆపారన్న కోపంతో ఓ మహిళ సెక్యూరిటీ గార్డులపై రెచ్చిపోయింది. వారిని బూతులు తిడుతూ ఆగ్రహంతో ఊగిపోయింది. ఓ సెక్యూరిటీ గార్డును కాలితో తన్నే ప్రయత్నం చేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: డెలివరీ బాయ్‌ని ఆపారన్న కోపంతో ఓ మహిళ సెక్యూరిటీ గార్డులపై రెచ్చిపోయింది. వారిని బూతులు తిడుతూ ఆగ్రహంతో ఊగిపోయింది. ఓ సెక్యూరిటీ గార్డును కాలితో తన్నే ప్రయత్నం చేసింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడాలోని సెంట్యూరియన్ పార్క్ టెర్రస్ హోమ్స్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ ఆన్‌లైన్‌లో కొన్ని వస్తువులు ఆర్డర్ పెట్టింది. ఆ డెలివరీ బాయ్ ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి అపార్ట్‌మెంట్స్ దగ్గరకు వచ్చాడు.
అయితే, అక్కడి సెక్యూరిటీ గార్డ్స్ డెలివరీ బాయ్‌ని లోపలికి వెళ్లనివ్వలేదు. అతడు మహిళకు విషయం చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ సెక్యూరిటీ గార్డ్స్‌పై బూతులతో రెచ్చిపోయింది. గట్టి గట్టిగా అరుస్తూ కొట్టడానికి కూడా ప్రయత్నించింది. దీన్నంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆ మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ధాన్యం నిల్వకు తెలంగాణ సర్కార్ భారీ ప్లాన్
ప్రకృతి విపత్తు కంటే అతి పెద్ద విపత్తు గొడ్డలి పార్టీ: అచ్చెన్నాయుడు