సాధువులతో ఫుట్‌బాల్ ఆడిన కుక్క.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:27 AM
ఓ కుక్క బాల సాధువులతో కలిసి ఫుట్‌బాల్ ఆడింది. ఎంతో ఉత్సాహంగా ఫుట్‌బాల్‌ను పట్టుకుని అటు, ఇటు పరిగెత్తుతూ సందడి చేసింది. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఓ కుక్క బాల సాధువులతో కలిసి ఫుట్‌బాల్ ఆడింది. ఎంతో ఉత్సాహంగా ఫుట్‌బాల్‌ను పట్టుకుని అటు, ఇటు పరిగెత్తుతూ సందడి చేసింది. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలో బౌద్ధ సన్యాసుల మఠం ఉంది. వారం రోజుల క్రితం కొంతమంది బాల సాధువులు మఠం ఆవరణలో ఫుట్‌బాల్ ఆడటం మొదలెట్టారు.
గోల్డెన్ రీట్రైవర్ జాతికి చెందిన మఫ్ఫు అనే కుక్క సాధువులు ఫుట్‌బాల్ ఆడటం చూసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లింది. సాధువులతో పోటీగా గేమ్ ఆడటం మొదలెట్టింది. ఫుల్‌బాల్‌ను పట్టుకుని అటు, ఇటు పరిగెత్తింది. కుక్క తమతో పాటు ఫుట్‌బాల్ ఆడుతుండటంతో సాధువులకు ఎంతో ఉత్సాహం వచ్చింది. దానికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా గేమ్ ఆడారు.
ఆ కుక్క సాధువులకు గట్టి పోటీ ఇస్తూ.. ఏమాత్రం తగ్గకుండా ఫుల్ ఎనర్జీతో గేమ్ ఆడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వీడియోను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’..‘నేను చూసిన వీడియోలలో ఇదే అద్భుతమైన వీడియో’..‘మఫ్ఫు ఎప్పటికైనా పెద్ద ఫుట్‌బాల్ ప్లేయర్ అవుతుంది’ అటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
గణపతి నవరాత్రులకు విద్యుత్‌శాఖ సన్నద్ధం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరు సభ్య సమాజానికి అవమానకరం: భట్టి విక్రమార్క