Share News

జంట వింత కోరిక.. శ్మశాన వాటికలో పెళ్లి..

ABN , Publish Date - May 02 , 2026 | 01:41 PM

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ జంట శ్మశాన వాటికలో పెళ్లి చేసుకుంది. మనుషుల బూడిద మధ్య మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది.

జంట వింత కోరిక.. శ్మశాన వాటికలో పెళ్లి..
Ghaziabad couple wedding

ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ జంట శ్మశాన వాటికలో పెళ్లి చేసుకుంది. మనుషుల బూడిద మధ్య మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ జంటకు పెళ్లి నిశ్చయమైంది. తమది డెస్టినేషన్ వెడ్డింగ్ అయి ఉండాలని జంట భావించింది. ఆ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్రదేశాన్ని వెతకటం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆ జంటకు ఓ వింత ఆలోచన వచ్చింది. అందరిలాగా కాకుండా కొత్తగా తమ పెళ్లి జరగాలని భావించింది.


శ్మశాన వాటికలో పెళ్లి చేసుకోవాలని జంట నిశ్చయించుకుంది. ఇందుకోసం ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలోని నదీ తీర ప్రాంత శ్మశాన వాటికను ఎంచుకుంది. తాజాగా జరిగిన ఈ పెళ్లికి 50 మంది దాకా అతిథులు వచ్చారు. శవాలను కాల్చే ప్రదేశంలో వధూవరులు మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆ జంట నిర్ణయాన్ని సమర్థిస్తుంటే.. మరికొంతమంది తప్పుబడుతున్నారు.


‘శ్మశానం నెగటివ్ ఎనర్జీ.. అక్కడ పెళ్లి చేసుకుని తప్పు చేశారు’..‘పెళ్లంటే పిల్లల ఆట కాదు. ఇష్టం వచ్చినట్లు చేయడానికి. పెద్దలు ఏం చెప్పినా దానికి ఓ బలమైన కారణం ఉంటుంది. శ్మశానంలో పెళ్లి చేసుకుంటే జీవితాలు నాశనం అవుతాయి’..‘సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటం కోసం చేసే స్టంట్లు ఇలానే ఉంటాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

రుణమాఫీ చారాణ చేసి.. బారాణ ఎగ్గొట్టింది.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు సెటైర్లు

కార్మికులకు అపార అవకాశాలు.. సద్వినియోగం చేసుకోండి: మంత్రి వాసంశెట్టి సుభాశ్

Updated Date - May 02 , 2026 | 01:58 PM