Share News

ప్రేమించిన అమ్మాయి కోసం జర్మనీ నుంచి ఇండియాకు.. హిందూ సంప్రదాయంలో పెళ్లి..

ABN , Publish Date - Mar 02 , 2026 | 08:06 AM

జర్మనీకి చెందిన ఓ యువకుడు భారతీయ అమ్మాయిని ప్రేమించాడు. ఫ్యామిలీతో సహా ఇండియాకు వచ్చి భారతీయ సంప్రదాయంలో ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు.

ప్రేమించిన అమ్మాయి కోసం జర్మనీ నుంచి ఇండియాకు.. హిందూ సంప్రదాయంలో పెళ్లి..
German groom India wedding

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు దేశాలు దాటి వచ్చాడు. జర్మనీకి చెందిన ఆ యువకుడు భారతీయ అమ్మాయిని ప్రేమించాడు. ఫ్యామిలీతో సహా ఇండియాకు వచ్చి భారతీయ సంప్రదాయంలో ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బరబంకీ జిల్లాకు చెందిన రూలన్ వర్మ అనే యువతి ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్ వియెన్నాలో ప్రొఫెసర్‌గా పని చేస్తోంది. జర్మనీకి చెందిన మార్కస్ కూడా అక్కడే ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు.


యూనివర్సిటీలో ఇద్దరికీ పరిచయం అయింది. ఆ పరిచయం కొంత కాలానికి ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. రూలన్ వర్మ తన తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించింది. ప్రేమికులిద్దరూ భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలోనే మార్కస్ తన కుటుంబసభ్యులను తీసుకుని జర్మనీనుంచి ఇండియాకు వచ్చేశాడు. బరబంకీలోని రాయల్ రియలైట్‌ హోటల్‌లో ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి కుమారుడు వేరే దేశానికి చెందిన వాడు కావటంతో ఈ పెళ్లి స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. బరాత్‌కు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. వరుడితో పాటు అతడి కుటుంబసభ్యులు కూడా బరాత్‌లో ఎంతో సంతోషంతో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇక, ఎల్లలు దాటిన ఈ ప్రేమ వివాహంపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘కొత్త జంటకు శుభాకాంక్షలు. మీరు జీవితాంతం ఎంతో సంతోషంగా జీవించాలి’..‘ప్రేమకు ఎల్లలు ఉండవు. ఇలాంటి పెళ్లిళ్లు ఇండియాలో చాలా జరిగాయి’..‘హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. చాలా గ్రేట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

తిరుపతిలో వాకర్స్ ఆందోళన.. ఎందుకంటే.?

ఆర్మీ పిలుస్తోంది!

Updated Date - Mar 02 , 2026 | 09:24 AM