Share News

ఇంటర్వ్యూలో జెన్‌జీ క్యాండిడేట్ వింత కోరిక.. కంపెనీ ఓనర్ ఏం చేశాడంటే..

ABN , Publish Date - Aug 08 , 2026 | 01:45 PM

జాబ్ ఇంటర్వ్యూకు వచ్చిన ఓ క్యాండిడేట్ కంపెనీ ఓనర్‌ను వింత కోరిక కోరాడు. ప్రతిరోజు మధ్యాహ్నం ఓ అరగంట పాటు నిద్రపోవడానికి అవకాశం కల్పించమని అడిగాడు.

ఇంటర్వ్యూలో జెన్‌జీ క్యాండిడేట్ వింత కోరిక.. కంపెనీ ఓనర్ ఏం చేశాడంటే..
Gen Z Job Interview

ఇంటర్‌నెట్ డెస్క్: జాబ్ ఇంటర్వ్యూకు వచ్చిన ఓ క్యాండిడేట్ కంపెనీ ఓనర్‌ను వింత కోరిక కోరాడు. ప్రతిరోజు మధ్యాహ్నం ఓ అరగంట పాటు నిద్రపోవడానికి అవకాశం కల్పించమని అడిగాడు. వింత కోరిక కోరిన క్యాండిడేట్‌ను ఓనర్ ఉద్యోగంలోకి తీసుకున్నాడా? లేదా అని తెలియాలంటే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన నితిన్ వర్మకు ‘ఇన్‌స్టాఆస్ట్రో’ అనే కంపెనీ ఉంది. కొద్దిరోజుల క్రితం జెన్‌జీ యువకుడిని నితిన్ ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆ యువకుడు వింత కోరిక కోరాడు.
geng.jpg


ప్రతిరోజు మధ్యాహ్నం ఓ అరగంట పాటు నిద్రపోవడానికి అవకాశం కల్పించమని అడిగాడు. అలా చేయటం ద్వారా ప్రొడక్టివిటీ పెరుగుతుందని అన్నాడు. ఆ కోరిక విని నితిన్ మొదట షాక్ అయ్యాడు. ఇంటర్వ్యూ మధ్యలోనే ఆపేద్దామని అనుకున్నాడు. ఆ యువకుడు ఎలాంటి కంగారు లేకుండా.. సీరియస్‌గా అడగటంతో నితిన్ ఆలోచనల్లో పడిపోయాడు. మధ్యాహ్నం ఓ అరగంట పాటు నిద్రపోవటం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది. ఆ పరిశోధనల గురించి నితిన్‌కు తెలుసు.


ఆ పరిశోధనల గురించి తెలిసి జెన్‌జీ యువకుడు అంత ధైర్యంగా ఇంటర్వ్యూలో ఆ కోరిక కోరి ఉంటాడని భావించాడు. బాగా ఆలోచించిన తర్వాత.. ‘నువ్వు ఎప్పుడు నిద్రపోతావో నాకు అనవసరం. కానీ, పని జరిగిందా? లేదా అన్నదే ముఖ్యం. నువ్వు ఎంత పని చేస్తున్నావన్నది నాకు ముఖ్యం. ఎన్ని గంటలు పని చేస్తున్నావన్నది కాదు. పని చేయకపోతే.. నిద్ర నిన్ను కాపాడదు’ అని చెప్పాడు. ఆ జెన్‌జీ యువకుడిని ఉద్యోగంలోకి తీసుకున్నాడు. ఈ స్టోరీ మొత్తాన్ని నితిన్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

ఎఫ్‌డీఏ సోదాలు.. రూ.1.93 కోట్లు విలువైన కల్తీ వంటనూనె సీజ్

తుంగభద్రకు పోటెత్తిన వరద

Updated Date - Aug 08 , 2026 | 01:55 PM