గణేశుడితో పాటూ కిందపడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే..
ABN , Publish Date - Sep 24 , 2026 | 07:12 PM
వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మూసీ పాత వంతెన వద్ద నిమజ్జనం చేస్తుండగా ఓ యువకుడు ప్రమాదవశాత్తూ వినాయక విగ్రహంతో పాటు నదిలో పడిపోయాడు. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి, సెప్టెంబర్ 24: జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మూసీ పాత వంతెన వద్ద గణేశ్ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే.. నిమజ్జనానికి నిర్దేశించిన ప్రదేశాన్ని కాకుండా వంతెన పైనుంచి కొందరు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తూ విగ్రహంతో పాటూ నదిలో పడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
నదిలో పడిన కొద్దిసేపటికే ఆ యువకుడు.. అదృష్టవశాత్తూ క్షేమంగా బయటికి రావడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. వినాయక నిమజ్జనాల సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశాలను మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నప్పటికీ.. నిబంధనలను పట్టించుకోకుండా వంతెనపై నుంచి నిమజ్జనం చేయడం ప్రమాదాలకు దారితీస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిమజ్జన వేడుకల్లో భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని.. ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా నిర్వాహకులు, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆ భయంకర సాఫ్ట్‌వేర్‌ని రద్దు చేయండి.. ఈసీఐనెట్ యాప్‌పై శశిథరూర్
కుల వివక్ష ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌కు మాజీ చీఫ్ మద్దతు