Share News

బంపరాఫర్.. ఒక ఎల్పీజీ సిలిండర్ ఇస్తే నెలంతా బిర్యానీ ఉచితం..

ABN , Publish Date - Mar 26 , 2026 | 09:20 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మనదేశంలో ఇంధన సంక్షోభాన్ని తీసుకొచ్చాయి. పెట్రోల్, గ్యాస్ కొరతలకు కారణమయ్యాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లకు కొరత రావడంతో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

బంపరాఫర్.. ఒక ఎల్పీజీ సిలిండర్ ఇస్తే నెలంతా బిర్యానీ ఉచితం..
LPG cylinder free biryani

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మనదేశంలో ఇంధన సంక్షోభాన్ని తీసుకొచ్చాయి. పెట్రోల్, గ్యాస్ కొరతలకు కారణమయ్యాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లకు కొరత రావడంతో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. చాలా రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ఓ హోటల్ వినూత్న ఆఫర్ ప్రవేశపెట్టింది (LPG cylinder free biryani).


తమిళనాడులోని హోసూరులో తళి రోడ్డులో ఉన్న ఓ హోటల్ నిర్వాహకులు ఎల్పీజీ సిలిండర్ కోసం ఓ వినూత్న ఆఫర్ ప్రవేశపెట్టారు. ఎవరైనా తమకు వాణిజ్య సిలిండర్ ఇచ్చి తమ హోటల్‌లో నెల రోజుల పాటు ఉచితంగా చికెన్ లేదా మటన్ బిర్యానీ తినొచ్చని ప్రకటించారు. అంతేకాదు, ఫుల్ సిలిండర్ తీసుకుని అదే కంపెనీకి చెందిన ఖాళీ సిలిండర్ వెంటనే ఇచ్చేస్తామని బోర్డు పెట్టారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (LPG reward scheme).


ఈ ప్రకటనకు గొప్ప స్పందన వచ్చిందట (Biryani reward scheme). గత పదిహేను రోజుల్లో ఆరుగురు సిలిండర్లు తీసుకొచ్చి ఇచ్చారట. అయితే వారిలో ఎవరూ నాలుగు రోజులకు మించి ఆ హోటల్లో బిర్యానీ తినలేదట. గ్యాస్ కొరత కారణంగా హోటల్‌ను మూసెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు, తన పాత కస్టమర్లు ఈ ఐడియా ఇచ్చారని సదరు రెస్టారెంట్ మేనేజర్ అశోక్ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

సంగక్కర రికార్డ్ బ్రేక్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్

ముంబైకి సాధ్యమా?

Updated Date - Mar 26 , 2026 | 09:20 PM