Lions fight viral video: మృగరాజుల భీకర పోరు.. వాటి గర్జన సౌండ్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే..
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:38 AM
వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ రెండు సింహాల మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ రెండు సింహాల మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (lion and lioness fight video).
@Axaxia88 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అడవిలో ఒక మగ సింహం, ఒక ఆడ సింహం మధ్య గొడవ మొదలైంది. రెండూ ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటుండగా, మధ్యలో మూడో సింహం రంగ ప్రవేశం చేసింది. దీంతో ఆ పోరు మధ్యలోనే ముగిసింది. అయితే ఆ సింహాలు చేసిన గర్జనలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సింహాల భీకర శబ్దాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (wildlife fight shocking video).
'స్వర్గం, భూమిని కదిలించే గర్జన! రెండు అరుదైన తెల్ల సింహ యోధులు మల్ల యుద్ధంలో ఢీకొన్నాయి. మృగరాజుల శక్తి మీ వెన్నెముకలో వణుకు పుట్టిస్తుంది' అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు(lioness attacks lion). ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 13 వేల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. సింహ గర్జన అంటే ఇదీ అంటూ కామెంట్లు చేశారు. ఇది పవర్ గేమ్ అని మరొకరు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
బాబా వంగా చెప్పింది నిజమవుతుందా.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..
రిపబ్లిక్ డే సేల్‌కు రెడీ అవుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటి నుంచంటే..