Share News

పెంపకం అంటే ఇదీ! ఈ తండ్రికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:17 PM

తన కొడుకు తప్పుదారి పడతాడేమోనని భయపడ్డ ఓ తండ్రికి అతడి కళ్లు తెరుచుకునేలా ఓ గుణపాఠం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

పెంపకం అంటే ఇదీ! ఈ తండ్రికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Father teaches son Life lessons

ఇంటర్నెట్ డెస్క్: తల్లిదండ్రులు ఎంత చేసినా ఇంకా ఏదో తక్కువైందని నిత్యం ఫిర్యాదులు చేసే బిడ్డలు ఎంతో మంది ఉంటారు. తన కొడుకు కూడా అలా మారుతున్న వైనం చూసిన భయపడ్డ ఓ తండ్రి తన కొడుకుకు ఓ గుణపాఠం చెప్పారు. తాను ఏం చేసిందీ చెబుతూ ఆ తండ్రి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. జనాలు ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పిల్లలకు అడిగిందల్లా ఇచ్చి వారి జీవితాల్ని చేజేతులా నాశనం చేసే తల్లిదండ్రులున్న ఈ కాలంలో ఇలాంటి పెంపకం చూడటం అరుదంటూ పొగడ్తల్లో ముంచెత్తారు.


తమకు 2 టైర్, 3 టైర్ ఏసీ రైలు కంపార్ట్‌మెంట్లల్లో ప్రయాణించడం అలవాటని ఆ వ్యక్తి తెలిపారు. కానీ దీపావళి హడావుడి కారణంగా ఇటీవల 3 టైర్ ఏసీ బోగీలో వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. కానీ తన కొడుకు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా సణగటం ప్రారంభించాడని అన్నారు. దీంతో, అతడికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుని అతడిని జనరల్ బోగీలో తీసుకెళ్లానని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా చెప్పారు.


ఆర్థికస్తోమతతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికీ సమానమైన గౌరవం ఇవ్వాలనే విషయాన్ని తాను తన బిడ్డకు చెప్పాలనుకున్నట్టు తెలిపారు. 300 ఏళ్ల క్రితం రైతులను సంపన్నులుగా చూసేవారని, ఉద్యోగాలు చేసేవారికి గుర్తింపు ఉండేది కాదని అన్నారు. ఇప్పుడు కాలం తిరగబడి ఉద్యోగాలు ఉన్న వారికి ఎక్కువ గౌరవం దక్కుతోందని చెప్పారు. పేద వారు, ధనికులు అనే పదాలకు నిర్వచనాలు మారుతూ ఉంటాయని అన్నారు. వందేళ్ల తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరని తెలిపారు. జీవితంలో మనకు లభించిన వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటూ అందరినీ సమానంగా గౌరవించాలన్నదే తన అభిమతమని చెప్పారు. ఈ వీడియోపై పెద్ద ఎత్తున స్పందించిన నెటిజన్లు ఆ వ్యక్తిది ఉన్నతమైన వ్యక్తిత్వమని, నేటి జమానాలో పిల్లల్ని ఇలా పెంచేవారు అరుదని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఏనుగుల వేషంలో టీచర్లు.. పిల్లల కోసం అదిరిపోయే స్కిట్.. వీడియో వైరల్

ఆయుష్షు పెరిగినా.. ఆరోగ్యం అంతంతే!

Updated Date - Nov 17 , 2026 | 06:53 PM