Share News

క్షణం ఆలస్యమైతే ప్రాణాలు పోయేవే.. కానీ ఆ తండ్రి ధైర్యం ముందు..

ABN , Publish Date - Apr 30 , 2026 | 08:23 AM

బంగ్లాదేశ్‌లోని భైరబ్ రైల్వే స్టేషన్‌లో ఓ దృశ్యం తండ్రి ప్రేమకు, సాహసానికి నిలువుటద్దంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే..

క్షణం ఆలస్యమైతే ప్రాణాలు పోయేవే.. కానీ ఆ తండ్రి ధైర్యం ముందు..
Father Saves Child Train

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లోని భైరబ్ రైల్వే స్టేషన్‌లో ఓ దృశ్యం తండ్రి ప్రేమకు, సాహసానికి నిలువుటద్దంగా నిలిచింది. కదులుతున్న రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న సందులో పడిపోయిన చిన్నారిని తండ్రి తన ప్రాణాలకు తెగించి కాపాడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 28న మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో భైరబ్ రైల్వే స్టేషన్ వద్ద ఢాకా వెళ్లే టైటాస్ కమ్యూటర్ రైలులో ఈ సంఘటన జరిగింది. తన చిన్నారిని రక్షించడం కోసం ఆ తండ్రి చేసిన సాహసాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


రైలు దాదాపు గంటన్నర ఆలస్యంగా వచ్చినప్పటికీ.. ఆ కుటుంబం స్టాప్‌లో దిగలేకపోయారు. రైలు మళ్లీ కదలడం ప్రారంభమవగానే తండ్రి ఆత్రంగా బిడ్డను ఎత్తుకుని రైలు దిగేందుకు యత్నించాడు. ఇంతలో ఆ చిన్నారి తండ్రి చేతుల్లోంచి జారి ప్లాట్‌ఫామ్ మధ్య ఉన్న ఇరుకైన సందులో పడిపోయాడు. ప్రమాదం ఉందని తెలిసినా, తండ్రి తన బిడ్డను కాపాడ్డం కోసం అందులోకి దూకి చిన్నారికి రక్షణగా నిలిచాడు. రైలు వారి పైనుంచి వెళ్లినప్పటికీ.. ఆ తండ్రి బిడ్డను ఏమాత్రం కదలకుండా పట్టుకోవడంతో ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.

రైలు వెళ్లాక క్షేమంగా బయటకు వచ్చిన తండ్రీకొడుకులను చూసి అక్కడి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది తెగ వైరల్ అవుతోంది. 'తండ్రి ప్రేమకు మించిన రక్షణ కవచం మరొకటి లేదు' అంటూ నెటిజన్లు ఆ తండ్రి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. మృత్యువు అంచున బిడ్డను కాపాడుకున్న ఆ తండ్రిని రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..

Updated Date - Apr 30 , 2026 | 11:38 AM