దేవుడా.. రైల్లో ఇలాంటి పనులా.. షాకింగ్ వీడియో
ABN , Publish Date - Nov 11 , 2026 | 05:26 PM
ఓ కుటుంబం తాము ప్రయాణిస్తున్న బోగీని వంటగదిలా మార్చేసి చిరుతిళ్లు తయారు చేసుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: రైలు ప్రయాణాల్లో చిరు తిళ్లు తినడం సర్వసాధారణం. కానీ ఓ కుటుంబం మాత్రం తాము ప్రయాణిస్తున్న బోగీని వంటగదిలా మార్చేసి చిరుతిళ్లు తయారు చేసుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. జనాల చేత గగ్గోలు పెట్టిస్తోంది. 3 టైర్ ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ఈ దృశ్యం కనిపించింది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ కుటుంబం ఏసీ కంపార్ట్‌మెంట్‌లోని మధ్య బెర్త్‌తో పాటు ఆ పక్కనే ఉన్న సీట్లను తమకు అనువుగా వినియోగించుకున్నారు. ఆ కుటుంబంలోని మహిళలు మధ్య బెర్త్‌పై తొలుత పేపర్లు పరిచారు. మిగతా వారు దానిపై బ్రెడ్ స్లైస్‌లను పెట్టారు. ఆ తరువాత వాటిపై కూర ముక్కలు, చట్నీ వంటివి వేసి శాండ్‌విచ్‌లను చేసుకున్నారు. ఎలక్ట్రిక్ టోస్టర్ తెచ్చి ఉంటే బాగుండేదని వారిలో ఓ మహిళ కామెంట్ చేశారు. తనకు గుర్తొచ్చి ఉంటే కచ్చితంగా టోస్టర్‌ను తెచ్చి ఉండేదాన్ని అని అన్నారు.
ఈ వీడియోపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక మంది ఆ కుటుంబం తీరుపై మండిపడ్డారు. రైలును అలా కిచెన్‌లా మార్చేయడం ఏమీ బాలేదని అన్నారు. భారతీయుల్లో పౌర స్పృహ పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. మరికొందరు మాత్రం ఆ కుటుంబాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. బెర్తులు పాడుకాకుండా వాటిపై పేపర్లు పరిచి తమ పని చేసుకోవడం మెచ్చుకోదగ్గ విషయమని చెప్పారు. టోస్టర్ తీసుకురావాల్సిందన్న కామెంట్‌పై మాత్రం కొందరు విమర్శించారు. రైల్లో వంటలు చేసుకుంటే అగ్నిప్రమాదాలు జరిగి ఇతరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని అన్నారు. ఇంతటి కీలక విషయం వారికి తెలియకపోవడంపై విచారం వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇంద్ర ధనస్సును కెమెరాతో రికార్డు చేస్తుండగా షాకింగ్ దృశ్యం!
20 అడుగుల కొండచిలువపై జారుడు బండ ఆట