శవ పేటిక ముందు అర్ధనగ్న నృత్యాలు.. అతడి చివరి కోరిక ఏంటో తెలిస్తే..
ABN , Publish Date - Apr 25 , 2026 | 07:03 PM
సాధారణంగా అంత్యక్రియల వాతావరణం విషాదభరితంగా ఉంటుంది. అంత్యక్రియలకు హాజరైన వారు విచారంలో మునిగిపోతారు. అయితే, థాయ్‌లాండ్‌లో జరిగిన ఒక సంఘటన ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా తుడిచి పెట్టేసింది.
సాధారణంగా అంత్యక్రియల వాతావరణం విషాదభరితంగా ఉంటుంది. అంత్యక్రియలకు హాజరైన వారు విచారంగా కనబడతారు. అయితే, థాయ్‌లాండ్‌లో జరిగిన ఒక సంఘటన ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా తుడిచి పెట్టేసింది. ఒక కుటుంబం తమ ప్రియమైన వ్యక్తి చివరి కోరికను నెరవేర్చడానికి డ్యాన్సర్లను నియమించుకుంది. శవపేటిక ముందు అర్ధ నగ్న డ్యాన్స్‌లు చేయించింది. ఈ అసాధారణ నిర్ణయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, చర్చకు దారితీసింది (Funeral dancers in Thailand).
థాయ్‌లాండ్‌కు చెందిన ఓ 59 ఏళ్ల వ్యక్తి ఇటీవల మరణించాడు. అతడి చివరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు అంత్యక్రియల సమయంలో మహిళా డ్యాన్సర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం బౌద్ధ ఆలయంలో జరిగింది. బౌద్ధ సన్యాసులు ప్రార్థనలు పూర్తి చేసి వెళ్లిపోయిన తర్వాత, దహన సంస్కారాలకు ముందు ముగ్గురు యువతులు శవ పేటిక ముందు డ్యాన్స్‌లు చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆ అశ్లీల నృత్యాలను తిలకించారు. మృతుడి చివరి కోరికను నెరవేర్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు (Last wish fulfilled funeral).
తన మరణాన్ని ప్రజలు దుఃఖంతో కాకుండా, ఆనందంతో గుర్తుంచుకోవాలని అతడు కోరుకున్నాడని, అందువల్లే అంత్యక్రియలకు ముందు ప్రదర్శన ఇవ్వడానికి ముగ్గురు నృత్యకారులను నియమించామని కుటుంబ సభ్యులు తెలిపారు (Thailand funeral dancers). అయితే ఈ చర్యపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. 'దుఃఖంలో కూరుకుపోవడం కంటే ఈ విధంగా ఒకరిని సాగనంపడం మేలు' అని ఒకరు పేర్కొన్నారు. 'అంతిమ కోరికలను గౌరవించడం ముఖ్యం. కానీ పిల్లలను ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంచాలి' అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..
నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..