Share News

అన్నం పెట్టిన మహిళకు కోతి తుది వీడ్కోలు.. తల దగ్గర కూర్చుని..

ABN , Publish Date - Apr 02 , 2026 | 06:49 AM

కుక్కలు, పిల్లలు, పాడి జంతువులతో మాత్రమే కాదు.. కోతులతో కూడా మనుషులకు విడదీయరాని బంధం ఉంది. కోతులు కూడా కుక్కల్లానే తిండి పెట్టిన మనిషికి విశ్వాసంగా ఉంటాయి. వారిపై ఎంతో ప్రేమ చూపిస్తాయి.

అన్నం పెట్టిన మహిళకు కోతి తుది వీడ్కోలు.. తల దగ్గర కూర్చుని..
monkey emotional video

ఇంటర్‌నెట్ డెస్క్: మనుషులకు జంతువులకు మధ్య బంధం ఈనాటిది కాదు. కుక్కలు, పిల్లలు, పాడి జంతువులతో మాత్రమే కాదు.. కోతులతో కూడా మనుషులకు విడదీయరాని బంధం ఉంది. కోతులు కూడా కుక్కల్లానే తిండి పెట్టిన మనిషికి విశ్వాసంగా ఉంటాయి. వారిపై ఎంతో ప్రేమ చూపిస్తాయి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచే సంఘటన ఒకటి కర్ణాటకలో చోటుచేసుకుంది. చన్నపట్నకు చెందిన 85 ఏళ్ల పార్వతమ్మ తన ఇంటి దగ్గరకు వచ్చే ఓ కోతికి తరచుగా అన్నం పెట్టేది. ఆరోగ్యం బాగోలేకపోయినా సరే దానికి తిండి పెట్టడం మానేది కాదు.


అయితే, వృద్ధాప్య సంబంధిత సమస్యల కారణంగా సోమవారం పార్వతమ్మ చనిపోయింది. కుటుంబసభ్యులు అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో పార్వతమ్మ తిండి పెట్టే కోతి అక్కడికి వచ్చింది. ప్రాణంలేని ఆమెను చూసి తల్లడిల్లిపోయింది. నేరుగా ఆమె తల దగ్గరకు వెళ్లి, మౌనంగా రోదించటం మొదలెట్టింది. కొన్ని నిమిషాల పాటు తలను పైకి ఎత్తకుండా బాధపడింది. తర్వాత ఆమె ముఖంపై తల పెట్టి కొన్ని క్షణాలు పాటు కళ్లుమూసుకుంది. అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు అది ఆమెను వదల్లేదు.


ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘కుక్కలు మాత్రమే కాదు.. ప్రేమగా చూసుకుంటే ఏ జంతువైనా మనతో విశ్వాసంగా ఉంటుంది’..‘ఆ కోతిని చూస్తుంటే నాకు కూడా బాధేస్తోంది. పాపం అది చాలా బాధపడుతోంది’..‘ప్రతీ మనిషి జీవితంలో స్వార్థం లేకుండా ప్రేమించే ఓ జీవి ఉండాలి. అది మనిషి అయినా.. జంతువైనా పర్లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

బాంబులను తప్పించుకుంటూ భారత్‌కు..

మరో సైలెంట్‌ హంటర్‌ ఐఎన్‌ఎస్‌ మాల్వాన్‌

Updated Date - Apr 02 , 2026 | 06:57 AM