Share News

బాంబులను తప్పించుకుంటూ భారత్‌కు..

ABN , Publish Date - Apr 02 , 2026 | 06:43 AM

యుద్ధానికి ముందు ఆ భారతీయుడు 50 రోజులు ఇరాన్‌ జైల్లో ఖైదీగా గడిపాడు. ఫిబ్రవరి 27న విడుదలై హమ్మయ్య ఇక ఇంటికి వెళ్లొచ్చు అనుకున్నాడు. తర్వాత రోజు విమానం టికెట్‌ బుక్‌....

బాంబులను తప్పించుకుంటూ భారత్‌కు..

యుద్ధానికి ముందు ఇరాన్‌లో చిక్కుకున్న ఢిల్లీ వ్యక్తి

  • బిక్కుబిక్కు మంటూ 25 రోజులు హోటల్లోనే

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1: యుద్ధానికి ముందు ఆ భారతీయుడు 50 రోజులు ఇరాన్‌ జైల్లో ఖైదీగా గడిపాడు. ఫిబ్రవరి 27న విడుదలై హమ్మయ్య ఇక ఇంటికి వెళ్లొచ్చు అనుకున్నాడు. తర్వాత రోజు విమానం టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. ప్రయాణానికి ఓ రోజు సమయం ఉండటంతో ఓ హోటల్‌లో రూమ్‌ తీసుకున్నాడు. తర్వాత రోజు ఫ్రెష్‌ అయ్యి ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతుంటే.. బయట బాంబుల వర్షం మొదలైంది. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎయిర్‌పోర్టు మూసివేశారు. ఏం చేయాలో తెలియక 25 రోజులు అక్కడే చిక్కుకుపోయాడు. జైల్లో నుంచి బయటకు వచ్చినపుడు యుద్ధం విషయం అతనికి తెలియదు. ఇరాన్‌ ప్రధాన నౌకాదళ బేస్‌ బందర్‌ అబ్బా స్‌లో ఉన్న అతను.. భారత ఎంబసీని సంప్రదిస్తే ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండండి.. బయటకు రావద్దు అని చెప్పారు. బిక్కుబిక్కు మంటూ 25 రోజులు హోటల్‌లో గడిపాడు. ఆ తర్వాత ఓ బస్‌లో బందర్‌ అబ్బాస్‌ నుంచి అర్మేనియాకు వెళ్లే అవకాశం దక్కింది. బాంబుల శబ్దాల మధ్యనే బస్సులో అతను ప్రయాణించాడు. ఎట్టకేలకు అర్మేనియా బోర్డర్‌కు చేరాడు. అక్కడి నుంచి విమానంలో భారత్‌కు వచ్చాడు. చివరికి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. ఇదంతా ఢిల్లీ సబర్బన్‌ ప్రాంతం ఘాజియాబాద్‌కు చెందిన కేతన్‌ మెహతా అనుభవం. ఇరాన్‌లో తాను చూసిన భయానక పరిస్థితులను కేతన్‌ మీడియాతో పంచుకున్నాడు.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 06:43 AM