మరో సైలెంట్ హంటర్ ఐఎన్‌ఎస్ మాల్వాన్
ABN , Publish Date - Apr 02 , 2026 | 06:39 AM
భారత నౌకాదళానికి మరో సైలెంట్ హంటర్ అందుబాటులోకి వచ్చింది. తీరప్రాంత రక్షణ కోసం స్వదేశీయంగా నిర్మించిన జలాంతర్గామి వ్యతిరేక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ మాల్వాన్ నేవీలో...
నేవీలో చేరిన యాంటీ-సబ్‌మెరైన్ యుద్ధనౌక
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: భారత నౌకాదళానికి మరో సైలెంట్ హంటర్ అందుబాటులోకి వచ్చింది. తీరప్రాంత రక్షణ కోసం స్వదేశీయంగా నిర్మించిన జలాంతర్గామి వ్యతిరేక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ మాల్వాన్ నేవీలో చేరింది. కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన రెండో యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ఏఎ్‌సడబ్ల్యూ ఎస్‌డబ్ల్యూసీ) ఐఎన్‌ఎస్ మాల్వాన్‌ను నౌకాదళం మంగళవారం స్వీకరించింది. నౌకాదళం కోసం నిర్మిస్తున్న ఎనిమిది ఏఎ్‌సడబ్ల్యూ ఎస్‌డబ్ల్యూసీ యుద్ధనౌకల శ్రేణిలో మాల్వాన్ రెండోది. మొదటి యుద్ధనౌక ఐఎన్‌ఎస్ మాహె గత ఏడాది నేవీలో చేరింది. కాగా, నేవీ అవసరాలకు అనుగుణంగా మాల్వాన్‌ను భారత్‌లోనే డిజైన్‌చేసి.. 80ు స్వదేశీ పరికరాలతో నిర్మించారు. మహారాష్ట్రలోని చారిత్రక తీరప్రాంత పట్టణమైన మాల్వాన్ పేరు దీనికి పెట్టారు. దాదాపు 80 మీటర్ల పొడవు, 1,100 టన్నులు బరువుండే ఈ యుద్ధనౌక తీరప్రాంతాల్లో లోతు తక్కువగా ఉన్న నీళ్లలోనూ తక్కువ శబ్ధంతో ప్రయాణిస్తుంది. శత్రువుల సబ్‌మెరైన్లను పసిగట్టి, వాటిని ధ్వంసం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
ఇవి కూడా చదవండి...
అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత
మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్
Read Latest AP News And Telugu News