Share News

ముందెన్నడూ చూడని రీతిలో బ్లింకిట్ డెలివరీ.. ఏకంగా గుర్రం మీద స్వారీ చేస్తూ..

ABN , Publish Date - Feb 23 , 2026 | 03:00 PM

రాజస్థాన్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు ఏకంగా గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్లి బ్లింకిట్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువుల్ని డెలివరీ చేస్తున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ముందెన్నడూ చూడని రీతిలో బ్లింకిట్ డెలివరీ.. ఏకంగా గుర్రం మీద స్వారీ చేస్తూ..
Rajasthan viral video

ఇంటర్‌నెట్ డెస్క్: సాధారణంగా మనం ఏవైనా వస్తువులు ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసినపుడు డెలివరీ బాయ్ స్కూటీ మీదో, బైక్ మీదో వచ్చి డెలివరీ చేస్తుంటాడు. సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటికి భిన్నంగా రాజస్థాన్‌లో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు ఏకంగా గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్లి బ్లింకిట్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువుల్ని డెలివరీ చేస్తున్నాడు. కపిల్ బిష్ణోయ్ అనే వ్యక్తి ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు.


‘ఇది రాజస్థాన్ బ్రో.. గుర్రాలపై స్వారీ చేయడానికి యువకులకు అవకాశం రావటం లేదు. కానీ, ముసలివాళ్లు మాత్రం గుర్రంపై స్వారీ చేస్తూ ఆన్‌లైన్ డెలివరీలు చేస్తున్నారు’ అని రాసుకొచ్చాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. తలకు పాగా కట్టుకున్న వృద్ధుడు నల్లటి గుర్రంపై రోడ్డు మీద వేగంగా స్వారీ చేస్తూ ఉన్నాడు. వృద్ధుడి భుజానికి బ్లింకిట్ బ్యాగ్ ఉంది. అయితే ఆ పెద్దాయన నిజంగానే గుర్రంపై ఆన్‌లైన్ డెలివరీలు చేస్తున్నాడనటానికి అధికారిక ఆధారాలు ఏవీ లేవు.


ఆ వీడియో వెనుక ఉన్న అసలు విషయం ఏంటో తెలియరాలేదు. 11 సెకన్ల ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇదే గనుక నిజం అయితే.. ఆ పెద్దాయనకు సెల్యూట్ చేయాలి. ఆయన ఈ ప్రపంచానికి ఓ ఆదర్శం’.. ‘కుటుంబం కోసం ఇలా కష్టపడేవాళ్లు చాలా మందే ఉన్నారు. వారు చాలా గొప్పవాళ్లు’.. ‘ఇలాంటి డెలివరీలు నేనెప్పుడూ చూడలేదు. ఇవన్నీ కేవలం ఇండియాలో మాత్రమే జరుగుతాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచ కప్: టీమిండియా తడబాటు.. కోహ్లీ విలువ తెలుస్తోందా?

ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..

Updated Date - Feb 23 , 2026 | 03:21 PM