Share News

భారతీయ మహిళకు సర్‌ప్రైజ్! రూ.12 లక్షల నగలు దుబాయ్‌‌లో పోయాయనుకుంటే..

ABN , Publish Date - Feb 08 , 2026 | 09:19 PM

దుబాయ్‌లో పోయాయనుకున్న నగలు దక్కడంతో ఓ భారతీయ మహిళ ఆనందానికి అంతేలేకుండా పోయింది. దుబాయ్ పోలీసులు ఆమెకు నగలు తిరిగి దక్కేలా చేశారు.

భారతీయ మహిళకు సర్‌ప్రైజ్! రూ.12 లక్షల నగలు దుబాయ్‌‌లో పోయాయనుకుంటే..
Dubai Lost Gold Found

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్‌లో పోయాయనుకున్న రూ.12 లక్షల నగలు తిరిగి దక్కడంతో ఓ భారతీయ మహిళ ఆనందానికి అంతేలేకుండా పోయింది. అక్కడి పటిష్ఠ పోలీసు వ్యవస్థ కారణంగా విలువైన నగలు దక్కాయి.

తమిళనాడుకు చెందిన కామినీ కన్నన్ అనే మహిళ దాదాపు 23 ఏళ్ల పాటు దుబాయ్‌లో ఉండి కొంతకాలం క్రితమే తిరిగొచ్చారు. అయితే, ఇటీవల ఆమె అక్కడ జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె పాత బ్యాగులోని బంగారు నగలను కొత్త బ్యాగులో పెట్టారు. ఆ బ్యాగును డైనింగ్ టేబుల్ మీద పెట్టారు. అయితే, అదే రోజు ఆమె తనయుడు పొరపాటున బ్యాగును చెత్తబుట్టలో వేశారు. ఫిబ్రవరి 1న వారు భారత్‌కు బయలుదేరాల్సి ఉండగా అంతకుముందు రోజే వారికి నగల విషయం తెలిసింది. దీంతో, ఏం చేయాలో అర్థంకాక వారంతా షాకైపోయారు.


ఇంతలో పోలీసుల నుంచి వారికి ఊహించని విధంగా ఫోన్ వచ్చింది. వారి బంగారు నగల బ్యాగ్ లభించిందనేది దాని సారాంశం. చెత్త తీసుకెళ్లే వ్యక్తి నుంచి నగలను తీసుకున్నామని, స్టేషన్‌కు వచ్చి తగిన ఆధారాలతో వాటిని తీసుకెళ్లాలని పోలీసులు తెలిపారు. దీంతో, ఆ కుటుంబం ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వారికి కేవలం రెండు మూడు గంటల వ్యవధిలోనే పని అయిపోయింది. నగలు తమవే అని ఆధారాలు చూపించాక పోలీసులు వాటిని తిరిగిచ్చేశారు.

ఇంత సులువుగా నగలు తిరిగొస్తాయని తాను అనుకోలేదని మహిళ తనయుడు తెలిపారు. చెత్తను కూడా ఓ క్రమపద్ధతిలో ట్రాక్ చేసే వ్యవస్థ కూడా అక్కడ ఉన్నట్టు తనకు అనిపించిందని తెలిపారు. గతంలో అనేక మందికి దుబాయ్‌లో ఇలాంటి అనుభవాలే ఎదురైన విషయం తెలిసిందే.


ఇవీ చదవండి:

30 ఏళ్ల మహిళ.. ఈమె కష్టాలు చూస్తే.. వైరల్ వీడియో

మద్యం మత్తులో యువతుల రచ్చ.. వైరల్‌గా మారిన వీడియో

Updated Date - Feb 08 , 2026 | 09:31 PM