స్కూల్ ప్రార్థనలో రెండు కాళ్లపై నిలబడిన శునకం.. వీడియో వైరల్
ABN , Publish Date - May 24 , 2026 | 03:56 PM
సిక్కింలోని ఒక పాఠశాలలో జరిగిన అద్భుతమైన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: సిక్కింలోని ఓ పాఠశాలలో జరిగిన అద్భుతమైన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. సాధారణంగా పాఠశాలల్లో ఉదయపు ప్రార్థనల సమయంలో విద్యార్థులంతా క్రమశిక్షణతో వరుసల్లో నిలబడి ప్రార్థన చేయడం చూస్తూనే ఉంటాం. అయితే.. సిక్కింలోని ఓ పాఠశాలలో ఉదయపు ప్రార్థన జరుగుతున్న సమయంలో కుక్క విద్యార్థుల పక్కకు చేరింది. పిల్లలు ప్రార్థన చేస్తుండటం చూసి నిశ్శబ్దంగా వారిని అనుకరించింది.
ఆ శునకం.. తన వెనుక కాళ్లపై నిల్చుని ముందు కాళ్లను పైకెత్తి ప్రార్థన భంగిమలో నిల్చింది. ఆ సమయంలో అక్కడున్న వారంతా దాని క్రమశిక్షణను చూసి ముగ్ధులయ్యారు. ప్రసన్న పఖ్రిన్ అనే నెటిజన్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ క్లిప్ కొద్దిసేపట్లోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు ఈ శునకం చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు. ‘కుక్కకు ఉన్న క్రమ శిక్షణ చూస్తే ముచ్చటేస్తోంది’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ‘ఈ కుక్క ప్రార్థన చూసి డిసిప్లిన్ అంటే ఏంటో నేర్చుకోవాలి’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌ను తగులబెట్టేందుకు ఇండియా కూటమి కుట్ర.. పీయూష్ గోయల్
అభిజీత్ దీప్కే, కిరణ్ రిజిజు మధ్య సోషల్ మీడియా వార్..