ఆస్పత్రిలోకి చొరబడి డబ్బు, నగలు ఉన్న బ్యాగ్ ఎత్తుకెళ్లిన కుక్క..
ABN , Publish Date - Aug 25 , 2026 | 06:37 PM
ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ కుక్క కలకలం సృష్టించింది. ఆస్పత్రిలోకి చొరబడ్డ ఆ కుక్క 4 లక్షల రూపాయలు విలువ చేసే డబ్బు, నగలు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో సోమవారం చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ కుక్క కలకలం సృష్టించింది. ఆస్పత్రిలోకి చొరబడ్డ ఆ కుక్క 4 లక్షల రూపాయలు విలువ చేసే డబ్బు, నగలు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మందసౌర్ జిల్లా, నాహర్‌ఘర్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని కాయంపూర్‌కు చెందిన లతాబాయి వాల్మీకి అనే మహిళ.. కుమారుడి తలకు గాయం అవ్వటంతో మందసౌర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించింది. చికిత్స కోసం డబ్బులు అవసరం అవుతాయని భావించి బ్యాగులో కొంత డబ్బు, నగలు తెచ్చుకుంది.
సోమవారం ఉదయం ఆమె బ్యాగు కోసం చూడగా కనిపించలేదు. వార్డు మొత్తం వెతికినా లాభం లేకపోవటంతో.. సిటీ కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలోకి ప్రవేశించిన ఓ కుక్క బ్యాగును నోటితో కరుచుకుని అక్కడినుంచి వెళ్లిపోయింది. పోలీసులు కుక్క ప్రయాణించిన మార్గంలో బ్యాగు కోసం వెతికారు. ఆస్పత్రి ప్రాంగణంలోనే బ్యాగు దొరికింది. అందులో డబ్బు, నగలు భద్రంగానే ఉన్నాయి.
ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత పోలీసులు ఆ బ్యాగును సోమవారం సాయంత్రం లతాబాయికి అందజేశారు. పోయిన బ్యాగును తిరిగి తెచ్చి ఇచ్చిన పోలీసులకు లతాబాయి ధన్యవాదాలు తెలిపింది. కుక్క బ్యాగును నోట కరుచుకుని వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వారిద్దరిపై క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం.. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్
నెల్లూరులో రైల్వే పోలీసుల సెర్చ్ ఆపరేషన్.. ముగ్గురి అరెస్ట్