Share News

తెలివంటే నీదే బ్రదర్.. యువకుడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

ABN , Publish Date - Jul 18 , 2026 | 10:00 AM

ఓ యువకుడు మొక్కజొన్న గింజలు ఒలవడానికి అందర్నీ ఆశ్చర్యపరిచే పని చేశాడు. గంటల సమయం పట్టే పనిని బైక్ సాయంతో చకచకా నిమిషాల్లోనే చేసేశాడు.

తెలివంటే నీదే బ్రదర్.. యువకుడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా..
viral video

ఇంటర్‌నెట్ డెస్క్: Necessity is the mother of invention అని ఇంగ్లీష్‌లో ఓ నానుడి ఉంది. అవసరమే ఆవిష్కరణలకు మూలం అని దాని అర్థం. మనిషి తన అవసరాల కోసం.. శ్రమను తగ్గించుకోవటం కోసం కొత్త కొత్త వస్తువులను సృష్టిస్తున్నాడు. రోజుల్లో అయ్యే పనిని గంటల్లో.. గంటల్లో అయ్యే పనిని నిమిషాల్లో చేసేస్తున్నాడు. తాజాగా, ఓ యువకుడు మొక్కజొన్న గింజలు ఒలవడానికి అందర్నీ ఆశ్చర్యపరిచే పని చేశాడు. గంటల సమయం పట్టే పనిని బైక్ సాయంతో చకచకా నిమిషాల్లోనే చేసేశాడు. ఇంతకీ సంగతేంటంటే..


ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాకు చెందిన ఓ యువకుడు మొక్కజొన్న గింజలు ఒలవడానికి బైక్ సాయం తీసుకున్నాడు. బైక్ టైర్‌ను ఉపయోగించి చకచకా మొక్కజొన్న గింజలు ఒలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. యువకుడు మొక్కజొన్న కంకుల్ని బైక్ టైర్ దగ్గర పెట్టగానే గింజలు మొత్తం ఊడి కిందపడుతున్నాయి. నిమిషంలో నాలుగు నుంచి ఐదు కంకుల నుంచి గింజలు ఒలిచేశాడు.


ఇవి కూడా చదవండి

ఫేక్‌ సర్టిఫికెట్లపై దక్షిణ డిస్కం ఫోకస్‌

గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Updated Date - Jul 18 , 2026 | 10:11 AM