Share News

పార్క్‌లో భారీ కొండచిలువ హల్‌చల్.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:12 PM

న్యూఢిల్లీలోని ఫారెస్ట్ వ్యూ అపార్ట్‌మెంట్స్‌ సమీపంలోని డీడీఏ పార్క్‌లో భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సురక్షితంగా పట్టుకున్నారు.

పార్క్‌లో భారీ కొండచిలువ హల్‌చల్.. వీడియో వైరల్
Delhi Python Rescue

ఇంటర్నెట్ డెస్క్: న్యూఢిల్లీలోని ఫారెస్ట్ వ్యూ అపార్ట్‌మెంట్స్ సమీపంలోని డీడీఏ పార్క్ ప్రాంతంలో భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికంగా కొద్దిసేపు కలకలం రేగింది. పార్క్ పరిసరాల్లో కొండచిలువను గుర్తించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే అటవీశాఖ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి.. చివరకు భారీ కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


అడవి నుంచి జనావాసాల్లోకి..

సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి కొండచిలువ జనావాసాల సమీపంలోకి వచ్చి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. అడవులకు సమీపంలో ఉన్న నివాస ప్రాంతాల్లోకి అప్పుడప్పుడు వన్యప్రాణులు వచ్చే అవకాశం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. జనావాసాల సమీపంలో వన్యప్రాణులు కనిపించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వాటిని స్వయంగా పట్టుకునేందుకు ప్రయత్నించకుండా వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

Updated Date - Aug 20 , 2026 | 05:13 PM