2 నెలల పాటు యూపీఐ వాడని మహిళ.. చివరకు ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jul 31 , 2026 | 09:43 PM
ప్రస్తుతం యూపీఐతో చెల్లింపులు జరపకుండా ఉండలేని పరిస్థితి ఉంది. అయితే, రెండు నెలల పాటు యూపీఐ వాడకపోవడంతో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఓ మహిళ పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం యూపీఐతో చెల్లింపులు జరపకుండా ఉండలేని పరిస్థితి ఉంది. అయితే, రెండు నెలల పాటు యూపీఐ వాడకపోవడంతో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఓ మహిళ పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ సదాఫ్ ఈ వీడియోను షేర్ చేశారు. తాను గత కొంత కాలంగా నగదునే వినియోగిస్తున్నట్టు చెప్పారు. దీంతో, తను డబ్బులు ఖర్చుపెట్టే తీరులో అనేక మార్పులు వచ్చాయని అన్నారు.
యూపీఐతో చెల్లింపులు జరిపే సమయంలో ఎంత డబ్బు ఖర్చు అవుతోందనే విషయంపై పూర్తిస్థాయి అవగాహన ఉండేది కాదని అన్నారు. చిన్న చిన్న మొత్తాలు యూపీఐతో చెల్లిస్తుండటంతో ఎంత ఖర్చవుతోందనే విషయం దృష్టిని దాటిపోయేదని అన్నారు.
నగదు వినియోగించడం ప్రారంభించాక పర్సులోంచి తీసే ప్రతి నోటు మనసుపై ప్రభావం చూపిస్తోందని చెప్పారు. ఎంత ఖర్చువుతోందనే విషయం ఇట్టే తెలిసిపోయి బ్రేకులు పడుతున్నాయని చెప్పారు. అయితే, ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా 80 శాతం సందర్భాల్లో నగదును, మిగిలిన సందర్భాల్లో యూపీఐని వినియోగించేందుకు నిర్ణయించుకున్నట్టు ఆమె చెప్పారు.
2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రారంభమైంది. మొదట్లో రోజుకు సగటున సుమారు లక్ష యూపీఐ లావాదేవీలు జరిగేవి. అయితే, డీమోనెటైజేషన్, యూపీఐలో థర్డ్ పార్టీ యాప్‌ల ఎంట్రీ, కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుతం రోజుకు రూ.84 వేల కోట్ల విలువగల 73 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
బాత్ రూమ్‌లో ఏడడుగుల మొసలి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
మరణానికి చేరువలో తండ్రి.. కొడుకుకి జీవిత పాఠాలు.. వీడియో వైరల్