Share News

తల్లిదండ్రులను సర్‌ఫ్రైజ్ చేసిన కుమార్తెలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Mar 15 , 2026 | 10:54 AM

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంది. ఇద్దరు కుమార్తెలు ఖరీదైన కారును తమ తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చారు. అయితే వారు ఆ గిఫ్ట్ ఇచ్చిన విధానం అందరిని భావోద్వేగానికి గురి చేసింది.

తల్లిదండ్రులను సర్‌ఫ్రైజ్ చేసిన కుమార్తెలు.. వీడియో వైరల్
daughters gift car to parents

ఇంటర్నెట్ డెస్క్: తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్ కోసం ఎంతో కష్టపడుతుంటారు. తమ పిల్లలు మంచి స్థితి ఉండాలని రేయింబవళ్లు కష్టపడి చదివిస్తుంటారు. తమ ఇష్టాలను చంపుకుని పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. కొన్ని సార్లు ఖరీదైన బహుమతులు ఇస్తు తమ బిడ్డలను పేరెంట్స్ సర్ ఫ్రైజ్ చేస్తుంటారు. అదే విధంగా చాలా మంది పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు తమ తల్లిదండ్రులపై ప్రేమను వివిధ రూపాల్లో చూపిస్తుంటారు. అమ్మానాన్నలకు గిఫ్టులు ఇస్తూ తమ ప్రేమను చాటుకుంటారు. తాజాగా ఇద్దరు యువతులు(daughters gift car to parents) చేసిన పనికి.. వారి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ వీడియోను వర్షా అనే యువతి సోషల్ మీడియాలో(Social Media) షేర్ చేసింది. వీడియో ప్రకారం.. ఇద్దరు కుమార్తెలు తమ తల్లిదండ్రులను కొత్త కారుతో ఆశ్చర్యపరిచారు. అమ్మానాన్నల కళ్ళకు గంతలు కట్టి వారి ఇంటి గేటు వద్దకు తీసుకెళ్తారు. ఆ తర్వాత వారి కళ్లకు కట్టిన గంతలు తొలగిస్తారు. దీంతో తమ ఎదురుగా ఉన్న పార్క్ చేసిన కొత్త కారును చూసి ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.ఇక ఆ యువతుల తండ్రైతే ఏకంగా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కుమార్తెల ఇద్దరిని ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు. వీరి నలుగురితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్నారు. ఆ యువతులు ఇద్దరూ తమ తల్లిదండ్రులకు కారు కీ ఇస్తుండగా.. కుటుంబ సభ్యులు సంతోషంతో చప్పట్లు కొట్టారు. తమ కోసం జీవితాంతం కష్టపడిన తల్లిదండ్రులకు ఈ బహుమతి 'చిన్న కృతజ్ఞత' అని వర్ష అనే యువతి తన ఇన్ స్టా వీడియో క్యాప్షన్‌లో వివరించింది.


' ఏపని మీరు చేయలేరు అని మాకు ఎప్పుడూ చెప్పలేదు. మాకు స్వేచ్ఛగా జీవించండి అని మాత్రమే చెప్పారు. అలాంటి ధైర్యాన్ని మీరు మాకు ఇచ్చారు. కాబట్టి, ఈ కారు జీవితాంతం మాకు మీరు ఇచ్చిన భద్రత, మద్దతు, నమ్మకానికి ఒక చిన్న కృతజ్ఞత మాత్రమే. చివరికి మేము నలుగురం మాత్రమే' సదరు యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. భారీగా లైక్స్ , వ్యూస్ వస్తున్నాయి. కూతుళ్లను అంత బాగా పెంచిన ఆ దంపతులకు ధన్యవాదాలు అంటు పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇలా తల్లిదండ్రులకు బహుమతుులు ఇవ్వాలనేది చాలా మంది యువతులకు ఉండే కల. అయితే కొందరు మాత్రమే కలను సాకారం చేసుకుంటారు.


ఇవి కూడా చదవండి:

గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ

ప్రజాసమస్యల పరిష్కారంలో ‘ఆంధ్రజ్యోతి’ది కీలక పాత్ర: ఎమ్మెల్యే పులివర్తి నాని

Updated Date - Mar 15 , 2026 | 11:04 AM