హనీమూన్‌లో షాకింగ్.. ఏదో చేయాలని చూస్తే.. చివరకు..
ABN , Publish Date - Sep 18 , 2026 | 03:51 PM
హనీమూన్‌ను జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలనుకున్న ఆ జంటకు ఊహించని షాక్ తగిలింది. సరదాగా బార్బెక్యూ చేస్తుండగా ఒక్కసారిగా ఎగిసిన మంటలు నూతన వధువును చుట్టుముట్టాయి. కాలిన గాయాలతో ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది..
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌కు చెందిన నూతన దంపతుల హనీమూన్ యాత్ర అనుకోని ప్రమాదంతో విషాదంగా మారింది. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన నికితా, సౌవిక్ దాస్‌లకు.. రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. హనీమూన్ కోసం డార్జిలింగ్‌లోని సిట్టాంగ్‌కు వెళ్లిన ఈ జంట.. అక్కడి ఓ హోమ్‌స్టేలో బస చేసింది. సెప్టెంబర్ 13 రాత్రి బార్బెక్యూ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో నికితా, ఆమె భర్త మంటల సమీపంలో కూర్చుని ఉండగా.. ఓ వ్యక్తి డబ్బాలోని లిక్విడ్‌ను మంటల్లో పోస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ వెంటనే మంటలు ఒక్కసారిగా ఎగిసిపడి నికితా వైపు వ్యాపించాయి. దీంతో ఆమె మంటల్లో చిక్కుకుని కిందపడిపోయింది. భార్యను రక్షించేందుకు సౌవిక్ వెంటనే పరుగెత్తగా.. మరో వ్యక్తి తన టీ-షర్ట్‌తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన దృశ్యాలు కూడా సీసీటీవీలో కనిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రమాదంలో నికితా శరీరంలోని పలు భాగాలకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. ఆమెను తొలుత సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో సిలిగురిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత హోమ్‌స్టే యాజమాన్యం వెంటనే స్పందించి సహాయం అందించలేదని కుటుంబం ఆరోపించింది. సౌవిక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బార్బెక్యూ సమయంలో భద్రతా చర్యలు తీసుకున్నారా? మంటల్లో ద్రవ పదార్థం ఎందుకు పోశారు? ప్రమాదం అనంతరం హోమ్‌స్టే నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యం ఆరోపణలపై హోమ్‌స్టే అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు సమాచారం.
Also Read:
ఆసియా క్రీడల్లో భారత పతాకధారులుగా మనూ భాకర్, తజీందర్‌పాల్ సింగ్
పెళ్లికి నెల రోజుల ముందు దారుణం.. హత్య చేసి మురుగు కాలువలో పడేసి..