Share News

ఈ జంట ఆదాయం నెలకు రూ.1.7 లక్షలు! చివర్లో మిగిలేది ఎంతో తెలిస్తే..

ABN , Publish Date - Jun 08 , 2026 | 01:57 PM

నెలకు రూ.1.7 లక్షలు సంపాదిస్తున్నా నెలాఖరులో రూ.2,520 మాత్రమే మిగులుతున్నాయంటూ ఒక జంట నెట్టింట ఆవేదన వ్యక్తం చేసింది. వారి ఖర్చులను పరిశీలించిన నెటిజన్లు పెద్ద మనసుతో స్పందిస్తూ పలు సలహాలు ఇచ్చారు.

ఈ జంట ఆదాయం నెలకు రూ.1.7 లక్షలు!  చివర్లో మిగిలేది ఎంతో తెలిస్తే..
Couple's Financial Dilemma

ఇంటర్నెట్ డెస్క్: నెలకు రూ.1.7 లక్షల కుటుంబ ఆదాయం ఉన్న ఒక జంటకు నెల చివర్లో రూ.2,520కు మించి మిగలట్లేదు. తమ వయసు 30 దాటిందని, పిల్లలు, సొంతిల్లు వంటి వాటికి ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం కావట్లేదంటూ ఆ దంపతులు నెట్టింట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

‘మా ఇద్దరికీ 30 ఏళ్లు దాటాయి. రెండేళ్ల క్రితం మాకు పెళ్లయ్యింది. ఇటీవలే రాబడి పోబడుల గురించి చెక్ చేస్తే కళ్లు బైర్లు కమ్మాయి. ఇంత సంపాదిస్తున్నా చేతులో ఏమీ మిగలట్లేదు. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? సొంతింటి కోసం ఎలా ప్లాన్ చేయాలి? పిల్లల కోసం ఎప్పుడు ప్లాన్ చేయాలి? అత్యవసర నిధిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి. టైమ్ మించిపోతోందని మాకు భయమేస్తోందని’ అని వారు తమ ఆవేదనను నెట్టింట పంచుకున్నారు.

Finance.jpg


తాము చెల్లించే ఈఎమ్‌ఐలు, ఇంటి అద్దె, ఇతరత్రా ఖర్చులు అన్నీ వివరంగా షేర్ చేశారు. ఈఎమ్‌ఐలే రూ.85 వేల వరకూ ఉంటాయని చెప్పారు. ఇందులో పర్సనల్ లోన్ వాటా ఎక్కువని అన్నారు. ఇతరత్రా ఖర్చులకు మరో రూ.81 వేలు పోతున్నాయని చెప్పారు. చివరకు రూ.2,520కు మించి మిగలట్లేదని వాపోయారు.

వారి ఖర్చులను ఓపిగ్గా పరిశీలించిన నెటిజన్లు పెద్ద మనసు చేసుకుని పలు సలహాలు ఇచ్చారు. పర్సనల్‌ లోన్స్‌‌తోనే అసలు సమస్య వచ్చిందని కొందరు తేల్చారు. నాలుగైదు నెలల్లో వాటిని తీర్చేస్తే ఆ తరువాత ప్లాన్‌పై స్పష్టత వస్తుందని అన్నారు. ఆదాయం పెంచుకోవడంపై కూడా దృష్టిపెట్టాలని మరికొందరు సూచించారు.


ఈ వార్తలనూ చదవండి:

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. వీడియో వైరల్

ప్రాణం కంటే రీల్ ముఖ్యమా.. వేగంగా వెళుతున్న రైలుకు వేలాడుతూ మహిళ సాహసం..

Updated Date - Jun 08 , 2026 | 02:21 PM