500 జాబ్స్‌కు అప్లై చేసినా నిరాశే! చివరకు..
ABN , Publish Date - Jul 04 , 2026 | 10:31 PM
500 ఉద్యోగాలకు అప్లై చేసినా ఫలితం లేకపోవడంతో ఒక యువకుడు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో చదవులు పూర్తి చేసుకుంటున్న యువతకు జాబ్ దొరకడం కష్టంగా మారుతోంది. ఇందుకు తాజా ఉదాహరణగా ఒక ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. 500 ఉద్యోగాలకు అప్లై చేసినా ఫలితం లేకపోవడంతో ఒక యువకుడు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఆ యువకుడి కష్టాల గురించి నీరజ్ అనే వ్యక్తి నెట్టింట పంచుకున్నాడు. యువకుడు ఈ ఏడాదే కంప్యూటర్ సైన్స్‌లో పట్టా పుచ్చుకున్నట్టు చెప్పాడు. బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంటే అతడు తన ఇంటికి వచ్చినట్టు చెప్పాడు. అతడు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అన్న విషయం మొదట తనకు తెలియదని అన్నాడు. అతడి హెల్మెట్‌కు ఉన్న కాలేజీ స్టిక్కర్‌ను చూసి అనుమానం రావడంతో అసలు విషయం బయటపడిందని చెప్పాడు.
తనకు జాబ్ లేని విషయాన్ని ఆ యువకుడు ఇప్పటికీ ఇంట్లో చెప్పలేదని తెలిపాడు. జాబ్ మార్కెట్ అలా ఉందని అతడు నిర్వేదం వ్యక్తం చేశాడని అన్నాడు. ఈ పోస్టు వైరల్ కావడంతో అనేక మంది యువకుడి పరిస్థితికి చలించిపోయారు. ప్రస్తుతం అనేక మంది యువత పరిస్థితి ఇలాగే ఉందని అన్నారు. చాలా మందికి సరైన ఉపాధి దొరక్క గిగ్ వర్క్‌ను ఎంచుకుంటున్నారని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ పోస్టు ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఓరి మీ దుంపలుతెగా.. ఏటీఎం గదిని ఇలా వాడేశారేంటీ..
ఏఐ జమానాలో జాబ్ దొరకడమే ఎక్కువ.. జాబ్ వెతుకులాటలో యువకుడికి షాక్