ఏఐ జమానాలో జాబ్ దొరకడమే ఎక్కువ.. జాబ్ వెతుకులాటలో యువకుడికి షాక్
ABN , Publish Date - Jul 04 , 2026 | 06:13 PM
కొత్త ఉద్యోగంలో చేరేందుకు శాలరీ పెంచాలన్న యువకుడికి తాజాగా షాక్ తగిలింది. ఇందుకు సంబంధించి అతడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగం మారుతున్నప్పుడు శాలరీ కూడా పెరగాలని ఎవరైనా కోరుకుంటారు. ఇలాంటి అంచనాలున్న ఒక యువకుడికి తాజాగా ఊహించని షాక్ తగిలింది. తన అనుభవాన్ని చెబుతూ అతడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
బెంగళూరుకు చెందిన ఒక యువకుడు ఈ పోస్టును పెట్టాడు. కంపెనీ మారేందుకు సిద్ధమేనా అంటూ ఒక మహిళా రిక్రూటర్ తనకు ఫోన్ చేసిందని చెప్పాడు. తాను శాలరీ పెంపు గురించి మాట్లాడితే మాత్రం కొన్ని హితబోధలు చేసి చివరకు ఠక్కున ఫోన్ పెట్టేసిందని అన్నాడు.
‘నా జాబ్ ప్రొఫైల్‌ను నౌక్రీ వెబ్‌సైట్‌లో చూసి ఆమె నన్ను సంప్రదించింది. కొత్త జాబ్‌కు సిద్ధమేనా అని ఆమె అడిగితే నేను సిద్ధమేనని అన్నారు. ఆ తరువాత నా వివరాలన్నీ అడిగి తెలుసుకుంది. కొన్ని సార్లు నేను మాట్లాడుతుంటే అడ్డుపడి తను చెప్పాల్సింది చెప్పింది. చివరకు చర్చ శాలరీపై మళ్లింది. నేను 40 శాతం హైక్ కోసం చూస్తున్నట్టు చెప్పాను. దీంతో ఆమె చికాకు పడింది. ఈమాత్రం పెంపు ఎందుకు సబబో చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఆమె మళ్లీ అడ్డుపడింది. ఈ ఏఐ జమానాలో జాబ్ దొరకడమే ఎక్కువ అంటూ నా మాటల్ని కొట్టిపారేసింది. ఆ తరువాత మరో మాటకు అవకాశం లేకుండా ఫోన్ పెట్టేసింది’ అని అన్నాడు.
ఈ పోస్టుకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ప్రొఫెషనలిజమ్, కనీస మర్యాదలు లేని కాలం వచ్చిపడిందనేందుకు ఇదో ఉదాహరణ అని కొందరు కామెంట్ చేశారు. పెను ముప్పు నుంచి ఆ టెకీ తప్పించుకున్నాడని మరికొందరు అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బ్యూటీపార్లర్ యజమాని పాడు పని.. చెప్పుతో చావగొట్టిన మహిళా వర్కర్లు..
అమానుషం.. మహిళను అర్ధనగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు..