కొలంబియాలో భూకంప విలయం.. పేక మేడల్లా కూలిన భవనాలు..
ABN , Publish Date - Aug 11 , 2026 | 09:34 AM
భారీ భూకంపం కారణంగా కొలంబియా అల్లకల్లోలం అయ్యింది. ఇప్పటి వరకు 132 మంది చనిపోగా.. 570 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
ఇంటర్‌నెట్ డెస్క్: భారీ భూకంపం కారణంగా కొలంబియా అల్లకల్లోలం అయ్యింది. ఇప్పటి వరకు 132 మంది చనిపోగా.. 570 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరికొన్ని సార్లు భూమి కంపించే అవకాశం ఉందని కొలంబియన్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. భూకంపం కారణంగా 1,575 గృహాలు, 18 హెల్త్ సెంటర్లు, 52 స్కూళ్లు పాశ్చికంగా దెబ్బతిన్నాయని అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా తెలిపారు.
61 బిల్డింగ్‌లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మేము ప్రజలను ఒంటరిగా విడిచిపెట్టము. వాళ్లు మా హృదయాల్లో ఉన్నారు. శక్తి వంచన లేకుండా వారి కోసం శ్రమిస్తాము’ అని అన్నారు. భూకంపం కారణంగా బిల్డింగ్‌లు పేక మేడల్లా కుప్పకూలుతున్న దృశ్యాల తాలూకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వందేళ్లలో మొదటి సారి భారీ భూకంపం రావటంతో పురాతన కట్టడాలు కూడా దెబ్బ తిన్నాయి.
ఇవి కూడా చదవండి
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: పావురాలు.. కోతుల బెడదకు చెక్ పెట్టేలా.. !
కాల్వలో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. యువతి గల్లంతు