Share News

కోయంబత్తూరులో ఆయుధ పూజ.. అగరబత్తీలతో పాల్గొన్న ఏఐ రోబోలు

ABN , Publish Date - Oct 20 , 2026 | 04:04 PM

దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించే ఆయుధ పూజకు ఈసారి సరికొత్త టెక్నాలజీ తోడైంది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఏఐ రోబోలు సంప్రదాయ పూజల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నాయి.

కోయంబత్తూరులో ఆయుధ పూజ.. అగరబత్తీలతో పాల్గొన్న ఏఐ రోబోలు
Coimbatore Robots

ఇంటర్నె్ట్ డెస్క్: తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఏడాది ఆయుధ పూజ వినూత్నంగా జరిగింది. సాధారణంగా ఆయుధాలు, పనిముట్లకు పూజలు చేసే సంప్రదాయానికి భిన్నంగా.. ఈసారి ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కోయంబత్తూరు జిల్లా ఆర్‌ఎస్‌.పురంలోని ఓ రోబోటిక్స్ కంపెనీలో ఉద్యోగులు దసరా సందర్భంగా రోబోలకు సంప్రదాయ దుస్తులు ధరింపజేసి ఆయుధ పూజ నిర్వహించారు. మనుషులు కర్పూర హారతి సమర్పించగా.. రోబోలు అగరబత్తీలు పట్టుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. హారతి, ధూపం వంటి సంప్రదాయ ఆచారాల్లో రోబోలు భాగస్వాములు కావడం అక్కడి వారిని ఆకట్టుకుంది.


మిరాకిల్‌(MIRAKILE) సంస్థ అభివృద్ధి చేసిన విద్యా, అవగాహన కల్పించే రోబోలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నాయి. రోబోటిక్ విడిభాగాలను కూడా పూజలో చేర్చడం విశేషంగా నిలిచింది. కేవలం పరిశ్రమలు, సాంకేతిక ప్రదర్శనలకే పరిమితమైన ఏఐ, రోబోటిక్స్‌ ఇప్పుడు సంప్రదాయ వేడుకల్లోనూ భాగమవుతున్నాయనే విషయాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. ఆధునిక సాంకేతికతను స్థానిక సంస్కృతి, సంప్రదాయాలతో మేళవిస్తూ నిర్వహించిన ఈ వినూత్న ఆయుధ పూజ కోయంబత్తూరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


ఈ వార్తలనూ చదవండి:

ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు.. బైకర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్

కశ్మీర్‌లో పురాతన శివలింగం పునరుద్ధరణ.. పోటెత్తుతున్న భక్తులు

Updated Date - Oct 20 , 2026 | 05:36 PM