Chinese man snake bite: పాపం.. పెంపుడు పాము ఎంత పని చేసింది.. ఆహారం నోట్లో పెడితే..
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:36 PM
విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే చాలా మంది పాములకు దూరంగా ఉంటారు. అయితే కొందరు మాత్రం పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. వాటిని పట్టుకునేందుకు ఆసక్తి చూపుతారు. విదేశాల్లో కొందరు విషపూరిత పాములను కూడా పెంచుకుంటున్నారు.
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే చాలా మంది పాములకు దూరంగా ఉంటారు. అయితే కొందరు మాత్రం పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. వాటిని పట్టుకునేందుకు ఆసక్తి చూపుతారు. విదేశాల్లో కొందరు విషపూరిత పాములను కూడా పెంచుకుంటున్నారు. అలా ఓ పామును పెంచుకుంటున్న ఓ చైనా వ్యక్తి దారుణ అనుభవాన్ని ఎదుర్కొన్నాడు (snake bite loses thumb).
బీజింగ్‌కు చెందిన హువాంగ్ అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి పాములంటే చాలా ఇష్టం. పాములను పట్టుకుని, వాటితో ఆడుకునేవాడు. ఆ ఇష్టం అతడిని ఓ విషపూరిత పామును పెంపుడు జంతువుగా పెంచుకునేలా చేసింది. కొంతకాలం క్రితం, హువాంగ్ పెంపుడు పాము అనారోగ్యానికి గురై ఆహారం కూడా తీసుకోలేని స్థితికి చేరుకుంది. దీంతో హువాంగ్ తన చేతులతో దానికి ఆహారం తినిపించడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆ విషపూరిత సర్పం అతడి బొటన వేలిని కరిచింది. పాము విషం అతడి శరీరమంతా వేగంగా వ్యాపించింది (venomous snake attack).
అతడి శరీరంలోని రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ఆ పాము విషం దెబ్బతీసింది (snake bite injury). పాము కాటేసిన బొటన వేలిలో నెక్రోసిస్ లేదా కణజాల నష్టం అనే సమస్య ప్రారంభమైంది. ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి వైద్యులు ఓ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే అతడి బొటన వేలును కత్తిరించేశారు. అలా చేయకపోతే అతడి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేది. ఇలా విషపూరిత సర్పాలను పెంచుకునే అభిరుచి ఎప్పుడు మరణానికి దారితీస్తుందో ఊహించడం అసాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలాపై అమెరికా దాడి.. భారత ఆయిల్ కంపెనీలకు లాభమేనా..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..