Share News

ఇదేం తెలివిరా బాబూ.. బైక్‌పై వెళుతుంటే కుక్కలు వెంటపడుతున్నాయని..

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:05 PM

అర్ధరాత్రి వెంట పడే కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు ఓ చైనా వ్యక్తి చూపిన పరిష్కారం ప్రస్తుతం వైరల్‌గా మారింది. జనాల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది.

ఇదేం తెలివిరా బాబూ.. బైక్‌పై వెళుతుంటే కుక్కలు వెంటపడుతున్నాయని..
Chinese Man Makes Street Dog Striking Stick

ఇంటర్నెట్ డెస్క్: వీధి కుక్కల బెడదతతో సతమతమయ్యే వారు ఎందరో ఉంటారు. ఇలాంటి వారు కొన్ని సందర్భాల్లో బయట కాలుపెట్టేందుకు కూడా సాహసించరు. ఇక అర్ధరాత్రి వేళ టూవీలర్లపై ప్రయాణించే వారు కూడా వీధి కుక్కల వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యకు ఓ చైనా వ్యక్తి కనిపెట్టిన పరిష్కారంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి తన స్కూటీ వెనుక టైరు పైన చిన్న కర్రను అమర్చాడు. బటన్ నొక్కితే కర్ర కదలి కుక్కపై దెబ్బపడేలా ఏదో ఏర్పాటు చేశాడు. ఆ తరువాత వీధిలో తన వెంటపడ్డ కుక్కలపై కర్రను ప్రయోగించాడు. తన ప్రయోగం ఫలించిందంటూ ఇందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశాడు.


తన ప్రయోగం ఫలించిందని సంబరపడుతూ అతడు షేర్ చేసిన ఈ వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అనేక మంది అతడిపై విమర్శలు గుప్పించారు. అది క్రూరత్వమని మండిపడ్డారు. కర్రతో కొట్టే బదులు కుక్కపై నీళ్లను పిచికారీ చేయగలిగితే మానవత్వాన్ని నిలబెట్టుకున్నట్టు ఉంటుందని కొందరు అన్నారు. మరికొందరు మాత్రం అతడిని విమర్శించే వారిపై మండిపడ్డారు. అర్ధరాత్రి ఒంటరిగా బైక్‌పై వెళుతున్నప్పుడు కుక్క వెంట పడితే అప్పుడు తెలుస్తుందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

అదనపు ఆదాయం కోసం ఆటో కొనుక్కున్న టెకీ.. చివరకు..

థ్రిల్‌ను పంచిన పెళ్లి ప్రపోజల్‌

Updated Date - Oct 04 , 2026 | 12:51 PM