Share News

పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? ఈ చిన్నారి పరిస్థితి చూస్తే..

ABN , Publish Date - Apr 11 , 2026 | 04:04 PM

మొబైల్ ఫోన్‌కు అలవాటు పడ్డ ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది నేటి తరం తల్లిదండ్రులు చూడాల్సిన వీడియో అంటూ జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? ఈ చిన్నారి పరిస్థితి చూస్తే..
Child Mobile Addiction

ఇంటర్నెట్ డెస్క్: సెల్‌ఫోన్ అడిక్షన్ ఎంత పెద్ద సమస్యగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ ఫోన్‌లకు బానిసలైపోతున్నారు. గంటలకు గంటలు మొబైల్ ఫోన్స్‌లో రీల్స్, షార్ట్ వీడియోలను చూస్తూ లోకం మర్చిపోతున్నారు. ఫోన్ లేనిదే క్షణం కూడా ఉండలేని స్థితికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నారులూ సెల్‌ ఫోన్ అడిక్షన్‌ బారిన పడటం అనేక మందిని కలవర పెడుతోంది. ఈ ధోరణికి పరాకాష్ఠగా కనిపించే ఒక ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, గాఢ నిద్రలో ఉన్న చిన్నారి తనకు తెలియకుండానే మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై వేళ్లు కదుపుతూ కనిపించింది. నిద్రలో కూడా ఆమె స్క్రీన్‌ను స్క్రోల్ చేస్తున్నట్టు కనిపించింది. చిన్నారి తన చేతిలో ఫోన్ పెట్టుకునే నిద్రలోకి జారుకున్నట్టు ఉంది.


ఇక ఈ వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తల్లిదండ్రులు అందరూ చూడాల్సిన వీడియో అని అనేక మంది కామెంట్ చేశారు. భారీగా వ్యూస్ వచ్చిపడ్డాయి. పిల్లలు ఇలాంటి దుస్థితికి చేరుకోవడానికి తల్లిదండ్రులే కారణమని కొందరు కామెంట్ చేశారు. నేటి జమానాలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు సెల్‌ఫోన్ ఇస్తున్నారని అనేక మంది ఆక్షేపించారు. చిన్నారి పరిస్థితి చూస్తే జాలేస్తోందని, పిల్లల మెదళ్లపై మొబైల్ ఫోన్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

కుక్క కాటు.. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స! జర్మన్ వ్యక్తికి ఆశ్చర్యం

కోపంతో పొడవడానికి వచ్చిన ఎద్దు.. ఇతను చేసిన చిన్న ట్రిక్‌తో.. చివరకు..

Updated Date - Apr 11 , 2026 | 04:24 PM