మతిస్థిమితం లేని యువతిపై యువకుడి అత్యాచారయత్నం.. హీరోలా అడ్డుకున్న వీధి కుక్క..
ABN , Publish Date - Sep 04 , 2026 | 01:13 PM
రోడ్డుపక్క నిద్రిస్తున్న మతిస్థిమితం లేని ఓ యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేయబోయాడు. అక్కడే ఉన్న ఓ వీధి కుక్క అతడిని అడ్డుకుంది. యువకుడిపై దాడి చేసి అక్కడినుంచి తరిమేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: రోడ్డుపక్క నిద్రిస్తున్న మతిస్థిమితం లేని ఓ యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేయబోయాడు. అక్కడే ఉన్న ఓ వీధి కుక్క అతడిని అడ్డుకుంది. యువకుడిపై దాడి చేసి అక్కడినుంచి తరిమేసింది. ఈ సంఘటన తమిళనాడులో గురువారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం అర్ధరాత్రి కోయంబత్తూర్‌లోని తుడియాలూర్ ఏరియాలో మతిస్థిమితం సరిగాలేని ఓ యువతి రోడ్డు పక్క నిద్రిస్తోంది. అటు వైపు వెళుతున్న ఓ యువకుడు ఆ యువతిని చూశాడు. ఆమెపై అత్యాచారం చేయడానికి దగ్గరకు వెళ్లాడు.
అతడు అత్యాచారానికి ప్రయత్నించగా యువతి ప్రతిఘటించింది. యువతి గట్టిగా అరుస్తుండటంతో అక్కడే ఉన్న ఓ కుక్క అలర్ట్ అయింది. అతడిపై దాడి చేసింది. దీంతో భయపడిపోయిన యువకుడు అక్కడినుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గణేశ్ నగర్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
భారతీయులున్న నౌకపై డ్రోన్ దాడి.. పాక్‌కు వెళుతుండగా..
ఆ రికార్డు బ్రేక్ చేస్తానని ఊహించలేదు: స్మృతి మంధాన