ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. సముద్రంలో ఏమైందో చూడండి
ABN , Publish Date - Oct 10 , 2026 | 07:15 AM
సముద్రంలో భీకర తుఫాను.. భారీ అలల మధ్య చిక్కుకున్న కార్గో షిప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎగిసిపడుతున్న అలలు, మెరుపులతో కూడిన భయానక దృశ్యాలు నెటిజన్లను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి ప్రకోపం ముందు మనిషి ఎంత చిన్నవాడో చాటిచెప్పే ఓ భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సముద్రం మధ్యలో భారీ తుఫానును ఎదుర్కొంటున్న ఓ కార్గో షిప్‌కు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. చుట్టూ చీకటి, ఉరుములు, మెరుపులు.. మరోవైపు ఎగిసిపడుతున్న సముద్రపు అలలు.. మొత్తానికి అక్కడి పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయి. ఒక పెద్ద పర్వతాన్ని తలపించే భారీ అల.. ఓడ వైపు దూసుకొచ్చి బలంగా ఢీకొట్టడంతో నీరు ఓడ ముందు భాగాన్ని ముంచెత్తినట్లు కనిపిస్తోంది. దీంతో నౌకలో ఉన్న సిబ్బంది పరిస్థితిని తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఈ దృశ్యాలు ఏదో హాలీవుడ్ విపత్తు సినిమాలోని సన్నివేశాలను తలపిస్తున్నాయి.
ఈ వీడియో el_mexicano_online అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసినట్లు సమాచారం. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘టైటానిక్ సినిమా గుర్తుకొస్తుంది’ అని, ‘ఇది రియల్‌గా అనుభవించిన వాళ్ల పరిస్థితి చూస్తుంటే భయం వేస్తోంది’ అని ఒకరు, ‘వాళ్ల గుండె ధైర్యానికి మెచ్చుకోవచ్చు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ వీడియోకు 4.9 లక్షలకు పైగా లైక్‌లు వచ్చినట్లు పేర్కొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎల్‌నినో ప్రభావం.. 2027 నాటికి భారత్‌లో వంటనూనెల కొరత..
భారత మూలాలున్న మహిళలకు నోబెల్ శాంతి పురస్కారం