కష్టాలకు చెక్.. అరలీటర్ నీళ్లతో 6 నెలలు గ్యాస్..
ABN , Publish Date - Mar 11 , 2026 | 07:11 AM
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో బెంగళూరు, ముంబై, చెన్నైలోని 30 శాతం హోటళ్లు ఇప్పటికే మూతపడ్డాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో బెంగళూరు, ముంబై, చెన్నైలోని 30 శాతం హోటళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ అవ్వడానికి గతంలో 3 నుంచి 5 రోజులు పట్టేది. ఇప్పుడు 20 రోజులు కూడా ఆగాల్సి వస్తోంది. సాధారణ జనాన్ని తీవ్ర స్థాయిలో గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి.
అరలీటర్ నీళ్లతో 6 నెలలు గ్యాస్..
ఆధ్యాత్మిక వేత్త శ్రీ శ్రీ రవి శంకర్‌కు చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కొద్దిరోజుల క్రితం ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. శ్రీ శ్రీ రవి శంకర్ ఆ కార్యక్రమంలో ప్రపంచం నివ్వెరపోయేలాంటి ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేశారు. మహేష్ అనే వ్యక్తి కేవలం అర లీటర్ నీళ్లతో ఆరు నెలల పాటు గ్యాస్‌ను అందించే యంత్రాన్ని తయారు చేసినట్లు వెల్లడించారు. ఆ యంత్రం గ్యాస్‌ను ఎలా ఉత్పత్తి చేస్తుందో వివరించారు. ‘ఆ యంత్రం వాటర్ నుంచి ఆక్సిజన్, హైడ్రోజన్‌ను వేరు చేస్తుంది. వేరు చేసిన హైడ్రోజన్‌ను గ్యాస్‌లాగా వాడుకోవచ్చు’..
‘కార్బన్ డయాక్సైడ్ గాల్లో కలిసిపోతుంది. హైడ్రోజన్ గ్యాస్‌ను మండించి వంట చేసుకోవటానికి మహేష్ ఒక స్టవ్‌ను కూడా తయారు చేశాడు. ఆ స్టవ్ మీద వంటలు చేసుకోవటానికి వీలు ఉంటుంది. ఈ టెక్నాలజీని మొదటగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌లో పరీక్షిస్తాం. ఆ తర్వాత దేశ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువస్తాం’ అని అన్నారు. ప్రస్తుతం వాటర్ గ్యాస్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘గ్యాస్ కష్టాలు వెంటాడుతున్న ఈ సమయంలో ఇలాంటి యంత్రాలు దేశ ప్రజలకు ఎంతో అవసరం. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి