Share News

ఇక నాకు ఐటీ జాబ్ రాదా? ఇటీవలే బీటెక్ చేసిన యువతి ఆవేదన

ABN , Publish Date - Jun 22 , 2026 | 07:54 PM

తనకు ఐటీ జాబ్ వస్తుందా? రాదా? అంటూ ఒక యువతి నెట్టింట ఆవేదనా భరిత పోస్టు పెట్టారు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

ఇక నాకు ఐటీ జాబ్ రాదా? ఇటీవలే బీటెక్ చేసిన యువతి ఆవేదన
BTech Graduate Placements

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలే బీటెక్ పూర్తి చేసిన యువతి ఇక తనకు ఐటీ జాబ్ రాదేమో అంటూ నెట్టింట ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె పోస్టుపై ప్రస్తుతం నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘నేను 2026లో బీటెక్ సీఎస్ఈ పూర్తి చేశాను. టైర్-3 కాలేజీ నుంచి. ప్రస్తుతం నాకు ఎలాంటి జాబ్ ఆఫర్స్ లేవు. ఇప్పటికే రెండు ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేశా. ఎన్నో ప్రాజెక్టులు చేశా. ఇంటర్వ్యూల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. అయినా ఇప్పటివరకూ అదృష్టం కలిసి రాలేదు. ఆఫ్ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌కు నాకు ఛాన్స్ లేదా?’

‘గేట్‌కు సిద్ధం అవుదామని నిన్ననే నిర్ణయించుకున్నాను. నా ఫ్రెండ్‌కు ఇప్పటికే ఐఐఎమ్‌లో సీటు రావడంతో నేను వెనకబడిపోయానని అనిపిస్తోంది. ఫ్రెండ్ జీవితంలో కొత్త అధ్యాయనం మొదలైంది. ఇది చూసి నేను భావోద్వేగంలో నిర్ణయాలు తీసుకుంటున్నానని అనిపిస్తోంది’ అని ఆమె పేర్కొంది.

Jobs2.jpg


ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. జూన్, జులై నెలల్లో సాధారణంగా హైరింగ్ తక్కువగానే ఉంటుందని అనేక మంది చెప్పారు. బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి ప్రయత్నించాలని అన్నారు. ఇతర గ్రాడ్యుయేట్స్ ఏం చేస్తున్నారో తెలుసుకుని ఆవైపు అడుగులు వేయాలని అన్నారు. జీవితంలో ఆలస్యం అనేదే లేదని, తగిన సమయంలో అవకాశాలు వస్తాయని చెప్పారు. నిరాశ పడవద్దని సూచించారు.


ఈ వార్తలనూ చదవండి:

యోగాలో పాల్గొన్న ఏనుగులు.. నెట్టింట వీడియో వైరల్..

క్యాబ్ డ్రైవర్‌కు జాక్‌పాట్.. రూ.500తో టికెట్ కొంటే రూ.3 కోట్లు..

Updated Date - Jun 22 , 2026 | 08:04 PM