Share News

భారత్‌కు వచ్చి.. ఆటోను వదిలివెళ్లలేక..

ABN , Publish Date - Nov 01 , 2026 | 08:04 PM

సాధారణంగా విదేశాలకు వెళ్లిన వారు తమ పర్యటనలకు తీపి గుర్తుగా ఏవైనా వస్తువులను వెంట తెచ్చుకుంటారు. భారత్‌లో పర్యటించిన ఓ యూకే జంట మాత్రం తాము ప్రయాణించిన ఆటోను వదలలేక బ్రిటన్ తీసుకెళ్లింది.

భారత్‌కు వచ్చి.. ఆటోను వదిలివెళ్లలేక..
British couple - Auto Rickshaw Viral Video

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా విదేశాలకు వెళ్లిన వారు తమ పర్యటనలకు తీపి గుర్తుగా ఏవైనా వస్తువులను వెంట తెచ్చుకుంటారు. భారత్‌లో పర్యటించిన ఓ యూకే జంట మాత్రం తాము ప్రయాణించిన ఆటోను వదలి తిరిగెళ్లేలేకపోయింది. చివరకు వాహనాన్ని బ్రిటన్‌కు తీసుకెళ్లింది. ఇటీవలే బ్రిటన్‌కు చేరుకున్న ఆటోను చూసి ఆ జంట సంబరం అంబరాన్ని అంటింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నారు.


హెలెన్, మైక్ జంట కొంతకాలం క్రితం భారత పర్యటనకు వచ్చారు. ఇక్కడ బజాజ్ ఆటోలో 75 రోజుల పాటు రకరకాల ప్రాంతాలను సందర్శించారు. ఆటోను తమ అభిరుచికి తగ్గట్టు డిజైన్ చేయించుకున్నారు. టిమ్మీ ద టిన్ క్యాన్ అని ఆటోకు ఓ పేరు కూడా పెట్టుకున్నారు. భారత్‌లో పలు ప్రాంతాల్లో దాదాపు 4 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎంజాయ్ చేశారు. ఈ జర్నీలో వారికి ఆ ఆటో నేస్తంగా మారిపోయింది.


బ్రిటన్‌కు తిరిగెళ్లే సమయంలో వారు ఆటోను భారత్‌లోనే వదలలేకపోయారు. చివరకు ఆటోను బ్రిటన్‌కు తీసుకెళదామని అనుకున్నారు. రకరకాల అనుమతులు తీసుకుని ఆ ఆటోను బ్రిటన్‌కు కార్గోలో పంపించారు. ఆ జంట బ్రిటన్‌కు వెళ్లిన ఆరు నెలల తరువాత ఆటో డెలివరీ అయ్యింది. అక్టోబర్ 23న బ్రిటన్‌కు చేరిన ఆటోను చూసి ఆ జంట ఆనందానికి అంతేలేకుండా పోయింది. ఆటోను చూసుకుని వారు తెగ మురిసిపోయారు. ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. లైకుల వర్షం కురిపిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

సింగిల్స్‌కు ఫిన్లాండ్ బంపర్ ఆఫర్.. ప్రేమలో పడేందుకు ఫ్రీ ట్రిప్ ఆహ్వానం

ఐఏఎస్ కాలేకపోయాడు.. భార్యతో కలిసి రూ.130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించాడు..

Updated Date - Nov 01 , 2026 | 08:09 PM