Share News

ఆకాశం నుంచి చెట్లపైకి ఎర్రటి పూల వర్షంలా పక్షుల సందడి.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 07 , 2026 | 08:12 AM

ప్రకృతి అందాలు ఒక్కోసారి మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంటాయి. అలాంటి ఓ అద్భుత దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్యాస్తమయ వేళ వందలాది ఎర్రటి పక్షులు ఒకేసారి చెట్లపై వాలుతుంటే.. ఆ ప్రాంతమంతా ఎర్రటి పూలతో నిండిపోయినట్లుగా కనిపిస్తోంది.

ఆకాశం నుంచి చెట్లపైకి ఎర్రటి పూల వర్షంలా పక్షుల సందడి.. వీడియో వైరల్
Guara Birds

ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి అందాలకు హద్దులే లేవని మరోసారి నిరూపించే అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రెజిల్‌లోని పర్నైబా డెల్టాలో ప్రతిరోజూ సూర్యాస్తమయ వేళ వందలాది స్కార్లెట్ ఐబిస్ పక్షులు (గ్వారోలు) గుంపులుగా తమ నివాస ప్రాంతాలకు తిరిగి వస్తుంటాయి. అస్తమిస్తున్న సూర్యుడి బంగారు కాంతిలో ఎర్రటి ఈకలతో మెరిసిపోతూ చెట్లపై వాలే ఈ పక్షులను చూస్తే.. పచ్చని చెట్లపై ఒక్కసారిగా ఎర్రటి పూలు పూసినట్లుగా కనిపిస్తుంది. రోజంతా ఆహారం కోసం వెతికిన ఈ పక్షులు సాయంత్రం వేళ గుంపులుగా ఎగురుతూ తమ గూళ్లకు చేరుకోవడం చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. ముఖ్యంగా మడ అడవులు.. తీర ప్రాంతాల్లో ఆవిష్కృతమయ్యే ఈ దృశ్యం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.


ఎర్రటి రంగు వెనుక అసలు రహస్యం ఇదే..

స్కార్లెట్ ఐబిస్ పక్షుల శరీరంపై కనిపించే ఆకర్షణీయమైన ఎరుపు రంగుకు వాటి ఆహారమే ప్రధాన కారణం. ఇవి ప్రధానంగా చిన్న పీతలు, రొయ్యలు, ఇతర జలచరాలను ఆహారంగా తీసుకుంటాయి. వాటిలో ఉండే కెరోటినాయిడ్ వర్ణద్రవ్యాలు పక్షుల ఈకలకు ప్రకాశవంతమైన ఎరుపు రంగును అందిస్తాయి. ప్రస్తుతం ఈ అద్భుత దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు ప్రకృతి అందాలను కొనియాడుతున్నారు. కొందరు దీనిని 'భూలోక స్వర్గం'గా అభివర్ణిస్తుండగా, మరికొందరు 'ప్రకృతి గీసిన అద్భుతమైన చిత్రపటం' అంటూ ప్రశంసిస్తున్నారు. నిజంగా ప్రకృతి సృష్టించిన ఈ ఎర్రటి రంగుల విందు చూపరులకు కనువిందు చేస్తోంది.


ఇవీ చదవండి:

కర్ణాటకలో పెట్రోల్‌లో 31 శాతం ఇథనాల్‌

తరుణ్‌ తేజ్‌పాల్‌ శిక్ష నిలిపివేతకు సుప్రీం నో

Updated Date - Nov 07 , 2026 | 08:34 AM