Share News

పానీపూరీలో ఎముక.. షాకైన యువతి..

ABN , Publish Date - May 17 , 2026 | 09:37 PM

భారతీయులు ఎక్కువగా ఇష్టపడే వంటకాల్లో పానీపూరీకి ప్రత్యేక స్థానం ఉంది. చాలా మందికి ఇది కేవలం ఆహారపదార్థం మాత్రమే కాదు.. ఎమోషన్ కూడా.

పానీపూరీలో ఎముక.. షాకైన యువతి..
panipuri safety tips

ఇంటర్‌నెట్ డెస్క్: భారతీయులు ఎక్కువగా ఇష్టపడే వంటకాల్లో పానీపూరీకి ప్రత్యేక స్థానం ఉంది. చాలా మందికి ఇది కేవలం ఆహారపదార్థం మాత్రమే కాదు.. ఎమోషన్ కూడా. రోజుకు ఒకసారైనా పానీపూరీ తినకుండా ఉండలేని వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది ఇష్టంగా తినే పానీపూరీ తయారీలో వ్యాపారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించటం లేదు. ఇందుకు తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. పానీపూరీలో ఎముక వెలుగు చూసిన ఘటన గుజరాత్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.


సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌కు చెందిన ఓ యువతి తన తల్లితో కలిసి రానిప్ బస్ టెర్మినల్ దగ్గరకు పానీపూరీ తినడానికి వెళ్లింది. కృష్ణ భేల్ పకోడీ స్టాల్‌లో పానీపూరీ తింటుండగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది. యువతి తింటున్న పూరీలో ఎముక బయటపడింది. దీంతో ఆ యువతి, ఆమె తల్లి షాక్ అయ్యారు. షాపు అతనిని నిలదీశారు. అది ఎముక కాదని, చెక్క ముక్క అని షాపు యజమాని అన్నాడు. ఆ యువతి ఎముకను వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.


ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. మున్సిపల్ కార్పోరేషన్ అధికారుల దృష్టికి వెళ్లింది. మున్సిపల్ అధికారులు షాపును పరిశీలించి, దాన్ని అక్కడినుంచి తొలగించారు. కాగా, బాధిత యువతి శాఖాహారి. తన జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ మాంసం తినలేదు. మొదటి సారి పానీపూరీ కారణంగా మాంసం తినాల్సి వచ్చింది.


ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2026: జురెల్, పరాగ్ హాఫ్ సెంచరీలు.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

గోవుల బర్త్ సర్టిఫికెట్ చూపించాల్సిందే.. వాహనాన్ని అడ్డుకున్న బెంగాల్ ఎమ్మెల్యే

Updated Date - May 17 , 2026 | 09:42 PM