చీర కట్టుతో రేసులోకి.. చిరుతపులిలా పరుగులు తీస్తూ..
ABN , Publish Date - Mar 16 , 2026 | 03:34 PM
బిహార్‌కు చెందిన ఓ యువతి చీర కట్టుతో అబ్‌స్టాకిల్ రేసులో పాల్గొంది. చిరుతపులిలా పరుగులు తీస్తూ తన రేస్‌ను రికార్ట్ టైమ్‌లో పూర్తి చేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: బిహార్‌కు చెందిన ఓ యువతి చీర కట్టుతో అబ్‌స్టాకిల్ రేసులో పాల్గొంది. చిరుతపులిలా పరుగులు తీస్తూ తన రేస్‌ను రికార్ట్ టైమ్‌లో పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బిహార్‌కు చెందిన నిషా మిశ్రా అనే యువతి తాజాగా అబ్‌స్టాకిల్ రేసులో పాల్గొంది. కేవలం రన్నింగ్ మాత్రమే కాకుండా క్లైంబింగ్, జంపింగ్, హ్యాంగింగ్ వంటి వాటిని ఎంతో సులభంగా చేసేసింది. అంతేకాదు.. ఐస్‌తో నిండిన నీటి కుంటలోకి కూడా దూకింది. రేస్ ప్రారంభం అయిన అతి కొద్ది నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకుంది.
నిషా మిశ్రా తరచుగా చీరతో జిమ్ వర్కవుట్లు చేస్తూ ఉంటుంది. ఈ వర్కవుట్లకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ‘నిషా ఆప్టిమిస్ట్’లో షేర్ చేస్తూ ఉంటుంది. ఆ వీడియోలు, ఫొటోలు కాస్తా వైరల్‌గా మారుతూ ఉంటాయి. అబ్‌స్టాకిల్ రేసులో పాల్గొన్న వీడియోను కూడా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘చీరలో నడవడానికే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది అబ్‌స్టాకిల్ రేసులో పాల్గొన్నావంటే నువ్వు చాలా గ్రేట్’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఎయిరిండియా కీలక నిర్ణయం.. దుబాయ్ వెళ్లే విమానాలు రద్దు
పాత ఇళ్లు, పాత ఫ్రెండ్స్.. ఎప్పుడైనా వెళ్తా, ఎప్పుడైనా వస్తా: రాజాసింగ్