పావ్ భాజీలో కాల్చేసిన బీడీ ముక్క.. కస్టమర్ ఏం చేశాడంటే..
ABN , Publish Date - Sep 02 , 2026 | 06:55 AM
ఆన్‌లైన్‌లో పావ్ భాజీ ఆర్డర్ చేసుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. పావ్ భాజీ పార్సిల్‌లో బీడీ ముక్క వెలుగుచూసింది. ఈ సంఘటన బెంగళూరులో మంగళవారం చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో పావ్ భాజీ ఆర్డర్ చేసుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. పావ్ భాజీ పార్సిల్‌లో బీడీ ముక్క వెలుగుచూసింది. ఈ సంఘటన బెంగళూరులో మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ప్రియమ్ తహబిల్దార్ అనే వ్యక్తి ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లో పావ్ భాజీ ఆర్డర్ చేశాడు. పార్సిల్ ఓపెన్ చేసి చూడగా.. ఉల్లిపాయ ముక్కల్లో కాల్చేసిన బీడీ ముక్క కనిపించింది. దీంతో ప్రియమ్ షాక్ అయ్యాడు.
వెంటనే దాన్ని ఫొటోలు తీసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ‘నేను ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లో పావ్ భాజీ ఆర్డర్ చేశాను. బీడీ ముక్కను ఫ్రీగా పొందాను. అది పూర్తిగా కాల్చేసిన బీడీ. నాకు అలాంటి ఉచిత పథకాలు అక్కర్లేదు. నాకు నిజాయితీ కావాలి’ అని రాసుకొచ్చాడు. ప్రియమ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఫుడ్ డెలివరీ యాప్ కస్టమర్ కేర్ టీమ్ ప్రియమ్‌ను సంప్రదించింది. తర్వాతి ఆర్డర్‌పై 100 రూపాయల కూపన్‌ను ఆఫర్ చేసింది.
ఇవి కూడా చదవండి
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.7.4 కోట్ల నకిలీ నోట్లు!